T20 World Cup: రషీద్‌ దెబ్బకు విండీస్‌ విలవిల.. ఇంగ్లాండ్‌కు స్వల్ప లక్ష్యం

ఛాంపియన్‌ వెస్టిండీస్‌ టీ20 ప్రపంచకప్‌లో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టు నిండా హిట్టర్లు ఉన్న విండీస్‌ కుదేలైంది. ఇంగ్లిష్‌ఛాంపియన్‌ వెస్టిండీస్‌ టీ20 ప్రపంచకప్‌లో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టు నిండా హిట్టర్లు ఉన్న విండీస్‌ కుదేలైంది. ఇంగ్లిష్‌

Updated : 23 Oct 2021 21:32 IST

దుబాయ్‌: ఛాంపియన్‌ వెస్టిండీస్‌ టీ20 ప్రపంచకప్‌లో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. జట్టు నిండా హిట్టర్లు ఉన్న విండీస్‌.. ఇంగ్లిష్‌ బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్‌ గేల్‌ (13) ఒక్కడే రెండంకెల స్కోరును సాధించడం విశేషం. ఇంగ్లాండ్‌ బౌలర్‌ అదిల్ రషీద్‌ (4/2) 2.2 ఓవర్లలో కేవలం రెండు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటర్లలో సిమన్స్ 3, లూయిస్ 6, హెట్‌మెయిర్‌ 9, డ్వాన్ బ్రావో 5, నికోలస్ పూరన్ 1, కీరన్‌ పొలార్డ్‌ 6, రస్సెల్‌ డకౌట్, హోసెన్ 6*, మెక్‌కాయ్ డకౌట్‌, రవిరాంపాల్‌ 2 పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మిల్స్‌ 2, మొయిన్ అలీ 2.. వోక్స్, జొర్డాన్ చెరో వికెట్ తీశారు. 

ఒక్కరంటే ఒక్కరూ నిలవకపాయే.. 

అంతా హార్డ్‌ హిట్టర్లు.. టీ20 స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు.. రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకున్న జట్టు. అలాంటిది విండీస్‌ తొలి మ్యాచ్‌ అంటే ఎన్ని అంచనాలు ఉంటాయి మరి.. అయితే వెస్టిండీస్‌ బ్యాటర్లు మాత్రం ఒక్కరంటే ఒక్కరూ కీలక ఇన్నింగ్స్‌ను ఆడలేదు. అలా వచ్చి ఇలా.. వెళ్లిపోయారు. సీనియర్‌ బ్యాటర్లు క్రిస్‌ గేల్, కెప్టెన్‌ పొలార్డ్‌, రస్సెల్‌ అయినా   ఓపికగా ఆడతారేమోనని చూసిన అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విండీస్‌ ఆటగాళ్లు నిలబడలేకపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని