James Anderson: అండర్సన్‌ ఎలా ముగిస్తాడో!

గ్లాండ్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడబోతున్నాడు. ఇప్పటికే రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్న అతడు బుధవారం వెస్టిండీస్‌తో ఆరంభమయ్యే తొలి టెస్టుతో చివరగా బరిలో దిగనున్నాడు.

Updated : 10 Jul 2024 02:58 IST

నేటి నుంచే ఇంగ్లాండ్‌-విండీస్‌ తొలి టెస్టు 
మధ్యాహ్నం 3.30 నుంచి

లండన్‌: ఇంగ్లాండ్‌ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడబోతున్నాడు. ఇప్పటికే రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్న అతడు బుధవారం వెస్టిండీస్‌తో ఆరంభమయ్యే తొలి టెస్టుతో చివరగా బరిలో దిగనున్నాడు. అండర్సన్‌ కెరీర్‌లో ఇది 188వ టెస్టు. ఇప్పటికే 187 మ్యాచ్‌ల్లో సరిగ్గా 700 వికెట్లు పడగొట్టిన 41 ఏళ్ల జిమ్మీ.. తన ఆఖరి టెస్టులో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం. అతను మరో 9 మందిని ఔట్‌ చేస్తే అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్న షేన్‌ వార్న్‌ (708)ను అధిగమిస్తాడు. ఇటీవల కౌంటీల్లో లాంక్‌షైర్‌కు ఆడుతూ నాటింగమ్‌షైర్‌పై అండర్సన్‌ 35 పరుగులకే 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. 2003లో జింబాబ్వేపై లార్డ్స్‌లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అండర్సన్‌.. తన చివరి టెస్టునూ లార్డ్స్‌లోనే ఆడబోతుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని