టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

భారత్‌×ఇంగ్లాండ్‌ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొతెరా వేదికగా ఇరు జట్లు డే/నైట్‌ టెస్టు ఆడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది...

Updated : 24 Feb 2021 14:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌×ఇంగ్లాండ్‌ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొతెరా వేదికగా ఇరు జట్లు డే/నైట్‌ టెస్టు ఆడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. టీమిండియా, ఇంగ్లాండ్ చెరో విజయంతో సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాయి.

మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియమైన మొతెరాలో అభిమానుల కేరింతలు మొదలయ్యాయి. ఈ స్టేడియం సామర్థ్యం లక్షా పది వేలు. కాగా, ఈ మైదానానికి నరేంద్ర మోదీ స్టేడియమని పేరు పెట్టారు. అంతకుముందు సర్దార్ పటేల్‌ స్టేడియంగా ఉండేది.

జట్టు వివరాలు
భారత్‌: రోహిత్‌, గిల్‌, పుజారా, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, పంత్‌ (వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌‌‌, బుమ్రా

ఇంగ్లాండ్‌: సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌ (వికెట్‌ కీపర్‌), ఆర్చర్‌, లీచ్‌, బ్రాడ్‌ అండర్సన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు