IND vs ENG: ఆడేది నాలుగో మ్యాచ్‌.. అలవోకగా కేన్‌, విరాట్‌ వికెట్లు

కేన్‌ విలియమ్సన్‌, విరాట్‌ కోహ్లీ ప్రపంచ స్థాయి బ్యాటర్లు. ఒకరు క్రీజ్‌లో పాతుకుపోతే వికెట్‌ ఇవ్వడు.. మరొకరు పరుగుల రారాజు.. అయితే వీరిద్దరిని ఒక యువ బౌలర్‌ బెంబేలెత్తించాడు.  ఇక ఆడుతోంది నాలుగో మ్యాచ్‌.. కానీ వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్లకే చెమటలు పట్టించేలా బంతులను సంధిస్తున్నాడు. అతడే ఇంగ్లాండ్‌ కొత్త

Published : 02 Jul 2022 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేన్‌ విలియమ్సన్‌, విరాట్‌ కోహ్లీ ప్రపంచ స్థాయి బ్యాటర్లు. ఒకరేమో క్రీజ్‌లో పాతుకుపోతే వికెట్‌ ఇవ్వరు.. మరొకరు పరుగుల రారాజు.. అయితే వీరిద్దరిని ఒక యువ బౌలర్‌ బెంబేలెత్తించాడు.  ఇక ఆడుతోంది నాలుగో మ్యాచ్‌.. కానీ వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్లకే చెమటలు పట్టించేలా బంతులను సంధిస్తున్నాడు. అతడే ఇంగ్లాండ్‌ కొత్త పేసర్ మాథ్యూ పాట్స్‌.. ఇదివరకు ఈ పేరు కూడా విని ఉండరు.. న్యూజిలాండ్ సిరీస్‌లో ఈ యువ పేసర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌నే హడలెత్తించాడు. ఆ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్సుల్లో కేన్‌ను మూడుసార్లు పెవిలియన్‌కు చేర్చాడు. లార్ట్స్‌ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మాథ్యూ పాట్స్‌... తాను వేసిన మొదటి టెస్టు తొలి ఓవర్లోనే విలియమ్సన్‌ను ఔట్‌ చేసి సంచలనం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ మంచి స్వింగ్, పేస్‌తో బంతులు వేస్తూ కేన్‌ వికెట్‌ పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇక కివీస్‌తో లీడ్స్‌లో జరిగిన మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో విలియమ్సన్‌ను మరోసారి పాట్స్ బోల్తా కొట్టించాడు. వికెట్ కీపర్‌ బెయిర్‌స్టోకి క్యాచ్‌ ఇచ్చి కేన్‌ పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూ పాట్స్‌ 3 మ్యాచ్‌ల్లో 23.03 సగటుతో 14 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. తాజాగా టీమ్‌ఇండియాతో జరుగుతోన్న ఐదో టెస్టు (కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన మ్యాచ్‌)లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీని ఔట్‌ చేశాడు. అతడితోపాటు హనుమ విహారి వికెట్‌ కూడా పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ వికెట్ తీసి సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి. 23 ఏళ్ల ఇంగ్లాండ్‌ యువ సంచలనం ప్రపంచ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ అండర్సన్‌, బ్రాడ్‌ల తరవాత ఇంగ్లాండ్‌ జట్టుకు ప్రధాన పేసర్‌ అవుతాడేమో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. పాట్స్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో డర్హమ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 24 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచులు ఆడిన పాట్స్‌ 77 వికెట్లు తీసి రాణించడంతో ఇంగ్లాండ్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని