PAK vs ENG: తొలి జట్టుగా ఇంగ్లాండ్ అరుదైన ఘనత.. 112 ఏళ్లనాటి రికార్డు బ్రేక్
పాకిస్థాన్ గడ్డపై ఆ జట్టు బౌలర్లను ఎదుర్కోవడం తేలికైన విషయం కాదు. అయితే ఇంగ్లాండ్ జట్టు అద్భుతమే చేసింది. దాదాపు వంద ఏళ్లకుపైగా రికార్డును అధిగమించి మరీ తొలి టీమ్‌గా అవతరించింది.
ఇంటర్నెట్ డెస్క్: చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ అదరగొట్టేస్తోంది. రావల్పిండి వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకొంది. మొదటి రోజే 500కిపైగా పరుగులు సాధించిన జట్టుగా అవతరించింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. అదీ.. దాదాపు 112 ఏళ్ల కిందట 1910లో దక్షిణాఫ్రికాపై 494/6 స్కోరు సాధించిది. అయితే గురువారం పాక్‌పై ఇంగ్లాండ్ ఏకంగా 506/4 స్కోరు చేయడం విశేషం. ప్రస్తుతం క్రీజ్‌లో హ్యారీ బ్రూక్ (101*), బెన్ స్టోక్స్ (34*) ఉన్నారు.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లాండ్‌ను పాక్ బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఓపెనర్లు జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107) తొలి వికెట్‌కు 233 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔటైనప్పటికీ.. రూట్ (23)తో కలిసి ఓలీ పోప్ (108) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రూట్ త్వరగానే పెవిలియన్‌కు చేరినా హ్యారీతో కలిసి పోప్ మరోసారి భారీ భాగస్వామ్యం నిర్మించాడు. నాలుగో వికెట్‌కు 182 పరుగులను జోడించాడు. సెంచరీ అనంతరం పోప్ పెవిలియన్‌కు చేరాడు. బెన్ స్టోక్స్ దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ 500 మార్క్‌ను దాటేసింది. తొలి ముగ్గురు బ్యాటర్లు శతకాలు బాదడం మరో విశేషం. పాక్ బౌలర్లలో జహిద్ మహమ్మద్ 2.. హారిస్, మహమ్మద్ అలీ చెరో వికెట్ తీశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్‌నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్‌భవన్‌లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్
-
Crime News
TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు
-
World News
China: జననాల క్షీణత ఎఫెక్ట్.. అక్కడ పెళ్లికాకపోయినా పిల్లల్ని కనొచ్చు..!