Viral Video:అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన క్రికెటర్‌.. ఆ ఆటగాడు ఎవరంటే?

ఏ దేశంలోనైనా సినీతారలు, క్రికెటర్లకు ఫుల్ క్రేజ్‌ ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వీరిని చుట్టేసి సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారు. ఇవి వీలుకాని పక్షంలో తమ అభిమాన నటుడు లేదా క్రికెటర్‌ నుంచి కనీసం ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

Published : 07 Jan 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఏ దేశంలోనైనా సినీతారలు, క్రికెటర్లకు ఫుల్ క్రేజ్‌ ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వీరిని చుట్టేసి సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారు. ఇవి వీలుకాని పక్షంలో తమ అభిమాన నటుడు లేదా క్రికెటర్‌ నుంచి కనీసం ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా క్రికెటర్లు నోట్‌బుక్స్‌, టోపీలు, జెర్సీల మీద ఆటోగ్రాఫ్‌లు చేస్తుంటారు. అయితే, ఇందుకు భిన్నంగా ఓ క్రికెటర్‌.. అభిమాని బట్టతలపై సంతకం చేశాడు. దీంతో గ్యాలరీలోని ప్రేక్షకులందరూ చప్పట్లు కొడుతూ కేరింతలు పెట్టారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

అసలేం జరిగిందంటే.. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 5న నాలుగో టెస్టు ప్రారంభ‌మైంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే వరుణుడు ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించాడు. ఈ క్రమంలో క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జాక్‌లీచ్‌ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరారు. ఫ్యాన్స్‌ కోరికను కాదనలేని జాక్‌ ఓ అభిమాని వ‌ద్దకు వెళ్లి అత‌డి బట్టతలపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఘటనతో గ్యాలరీలోని అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఈ దృశ్యాల‌ను మైదానంలోని లైవ్ స్క్రీన్‌ లో కూడా చూపించడం విశేషం. మరి మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసి సరదాగా నవ్వుకోండి.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని