అలీ ఔట్‌: జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్‌

టీమిండియాతో జరగనున్న పింక్‌ బాల్‌ టెస్టుకు 17 మంది ఆటగాళ్లతో ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. జానీ బెయిర్‌స్టో, మార్క్‌ వుడ్‌ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే మొయిన్‌...

Published : 16 Feb 2021 22:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియాతో జరగనున్న పింక్‌ బాల్‌ టెస్టుకు 17 మంది ఆటగాళ్లతో ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. జానీ బెయిర్‌స్టో, మార్క్‌ వుడ్‌ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే మొయిన్ అలీకి చోటు దక్కలేదు. విరామం కోసం అతడు స్వదేశానికి రానున్నాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. శ్రీలంక పర్యటనకు వచ్చిన అతడికి ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. మహమ్మారి నుంచి కోలుకున్న అతడు భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఎనిమిది వికెట్లు తీశాడు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొతెరా వేదికగా ఫిబ్రవరి 24 నుంచి భారత్×ఇంగ్లాండ్‌ మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్ జట్టు వివరాలు

బర్న్స్‌, సిబ్లీ, క్రాలే, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), బెయిర్‌ స్టో, బెన్ ఫోక్స్‌, పోప్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్ వోకస్‌, బెస్‌, లీచ్‌, అండర్సన్‌, బ్రాడ్‌, ఆర్చర్‌, స్టోన్‌, మార్క్‌ వుడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని