Jack grealish: మొదటి గోల్‌ చిట్టి అభిమానికి అంకితం.. మనసు గెలుచుకున్న ఇంగ్లాండ్‌ ఆటగాడు

ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు జాక్‌ గ్రెలీష్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరి మనసులు గెలుచుకున్నాడు.

Updated : 22 Nov 2022 14:58 IST

ఖతర్‌: ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఇరాన్‌తో  జరిగిన మ్యాచ్‌ను సోమవారం ఇంగ్లాండ్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆటగాడు జాక్‌ గ్రెలీష్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరి మనసులు గెలుచుకున్నాడు.  అయితే ఈ మ్యాచ్‌తో తన తొలి గోల్‌ను సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అంకితం ఇచ్చాడు. 

నెల రోజుల క్రితం ఫిన్లే నుంచి అందిన ఓ లేఖకు గ్రెలీష్‌ బదులిచ్చాడు. అంతేగాక అతడి ఇంటికి వెళ్లి తన చిట్టి అభిమానిని ఆశ్చర్యపరిచాడు. అదే సమయంలో అతడితో కలిసి మొదటి గోల్‌ సంబరాలు చేసుకుంటానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే ఫిన్లేకు నచ్చిన మేనరిజం (భుజాలను గాల్లో ఎగరేస్తూ)ను చేసి చూపిస్తూ అతడిని సంతోషపెట్టాడు. ‘‘నేను నెల రోజుల క్రితం ఫిన్లేను కలిశాను. నా చిన్న చెల్లెలిలాగానే ఇతడు కూడా సెరిబ్రల్  పాల్సీ వ్యాధితో బాధపడుతున్నాడు. తనతో కొంత సమయం గడపాలని నన్ను కోరాడు. అదృష్టవశాత్తు ఆ కోరిక ప్రపంచకప్‌తో నెరవేరింది. నన్ను ఇలా కలుసుకోవడం ఫిన్లేకు వెలకట్టలేని అనుభూతినిచ్చిందని నాకు తెలుసు. ఫిన్లే ఇది నీకోసం’’ అంటూ గ్రెలీష్‌ తెలిపాడు. ‘‘నన్ను అందరితో సమానంగా ఆదరించావు.. నీలా ప్రతిఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ ఫిన్లే హర్షం వ్యక్తం చేశాడు. 
 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు