pak vs eng: ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు అస్వస్థత.. పాక్‌తో తొలి మ్యాచ్‌ అనుమానమే..

పాక్‌ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ వాయిదా పడే అవకాశాలున్నాయి. 

Updated : 14 Dec 2022 11:15 IST

రావల్పిండి: సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్‌ జట్టుకు ఊహించని అంతరాయం ఏర్పడింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం రావల్పిండిలో జరగనున్న తొలి మ్యాచ్‌ వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సహా సగం మంది ఆటగాళ్లు గుర్తు తెలియని వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా బాధపడుతున్నారని పాక్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. 

ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని.. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పీసీబీ తెలిపింది. ఈ విషయంపై ఇంగ్లాండ్‌ , వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)తో చర్చిస్తున్నట్టుగా పేర్కొంది. ఆటగాళ్లు అస్వస్థతకు గురైన విషయం నిజమేనని మాజీ ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ తెలిపాడు. అయితే మ్యాచ్‌ ముంగిట జట్టులో ఏవైనా మార్పులు చేస్తారా? అనే విషయంపై స్పష్టతనివ్వలేదు. ఈసీబీ ప్రతినిధి డానీ రూబెన్‌ మాట్లాడుతూ.. ‘‘ఏడు మంది ఆటగాళ్లు సహా తమ బృందంలోని 14 మంది వరకు వైరస్‌ బారినపడ్డారు. అయితే, ఇది ఫుడ్‌ పాయిజన్‌, కరోనాకు సంబంధించినది కాదు’’ అని తెలిపాడు. ఈ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ ముల్తాన్‌ వేదికగా డిసెంబర్‌ 9 నుండి ప్రారంభం కానుంది. కరాచీలో 17-21 మధ్య చివరి మ్యాచ్‌ జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని