Updated : 07 Jul 2022 22:40 IST

India vs England: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. టాస్‌ గెలిచిన టీమిండియా

(Photo: BCCI Twitter)

సౌథాంప్టన్‌: ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి సమరం మరికాసేపట్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టుకు బౌలింగ్‌ అప్పగించాడు. జట్టు నిండా హిట్టర్లతో ఉన్న ఇంగ్లాండ్‌ను ఈ సిరీస్‌లో నిలువరించడం భారత్‌కు సవాలే. ఇయాన్‌ మోర్గాన్‌ రిటైరైన నేపథ్యంలో జోస్‌ బట్లర్‌ ఈ సిరీస్‌తోనే ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

టీమిండియా: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తిక్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యుజేంద్ర చాహల్‌.

ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్(కెప్లెన్)‌, డేవిడ్‌ మలన్‌, మొయిన్‌ అలీ, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, హ్యరీ బ్రూక్‌, సామ్‌ కరణ్‌, క్రిస్‌ జోర్డాన్‌, టైమల్‌ మిల్స్‌, రీసి తోప్లే, మాథ్యూ పార్కిన్‌సన్‌.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని