INDvsENG: అలాగైతే కోహ్లీసేనను ఓడించొచ్చు
ఐదు టెస్టుల సిరీసులో బంతి స్వింగ్ అయితే టీమ్ఇండియా ఇబ్బందులు పడుతుందని ఇంగ్లాండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్ అంటున్నాడు. భారత్‌కు గొప్ప బ్యాటింగ్ లైనప్ ఉన్నా కదిలే బంతిని ఆడలేకపోవడం వారి బలహీనతని పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌కు విజయావకాశాలు మెరుగ్గా...
ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడమే ఫైనల్లోఓటమికి కారణం: కుక్
లండన్: ఐదు టెస్టుల సిరీసులో బంతి స్వింగ్ అయితే టీమ్ఇండియా ఇబ్బందులు పడుతుందని ఇంగ్లాండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్ అంటున్నాడు. భారత్‌కు గొప్ప బ్యాటింగ్ లైనప్ ఉన్నా కదిలే బంతిని ఆడలేకపోవడం వారి బలహీనతని పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేశాడు.
‘టీమ్ఇండియా గొప్ప జట్టు. కానీ స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం వారి బలహీనత. ఆగస్టు నెలలో వాతావరణం చల్లగా ఉండి, బౌలర్లకు అనకూలిస్తే ఇంగ్లాండ్‌కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని కుక్ అన్నాడు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియా జట్టు ఎంపికలో తప్పులు చేసిందని కుక్ తెలిపాడు. తమను తాము కాస్త అతిగా అంచనా వేసుకున్నట్టు కనిపించిందన్నాడు.
‘జట్టు ఎంపికపై కోహ్లీసేన ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. మూడు రోజులు ముందుగానే జట్టును ప్రకటించింది. ఆటలో ఎక్కువ భాగం వర్షం కురుస్తుందని ముందే తెలిసినా ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకున్నారు. దాంతో ఎక్కువగా సీమ్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది’ అని కుక్ తెలిపాడు.
ఫైనల్లో టీమ్ఇండియా ఓటమికి మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమూ ఒక కారణమేనని కుక్ అన్నాడు. ‘న్యూజిలాండ్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టే గెలిచిందని నేను కచ్చితంగా చెప్పగలను. ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టులతో వారికి సన్నద్ధత లభించింది. అంతర్గత మ్యాచులు ఆడాలన్న ఉద్దేశం మంచిదే అయినా దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. తొలి గంటలో ఉన్నంత తీవ్రత తర్వాత మాయమవుతుంది’ అని అతడు వెల్లడించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!