T20 World Cup: అమెరికాను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్‌

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో భాగంగా అమెరికాను ఇంగ్లాండ్‌ 10 వికెట్ల తేడాతో చిత్తుచేసి గ్రూప్‌ 2 నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. 

Updated : 23 Jun 2024 23:04 IST

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌-2 నుంచి ఇంగ్లాండ్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత యూఎస్‌ జట్టును 115 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఇంగ్లాండ్‌.. అనంతరం బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. కేవలం 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (83: 38 బంతుల్లో 7 సిక్స్‌లు, 6 ఫోర్లు) విశ్వరూపం ప్రదర్శించాడు. ఫిలిప్‌ సాల్ట్‌ (25: 21 బంతుల్లో 2 ఫోర్లు) సహకరించాడు. 

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన అమెరికా.. ఇంగ్లిష్‌ బౌలర్ల దెబ్బకు 18.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ జోర్డాన్‌ హ్యాట్రిక్‌తో సహా మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. యూఎస్‌ బ్యాటర్లలో ఓపెనర్లు స్టీవెన్ టేలర్ (12), ఆంద్రీస్‌ గౌస్ (8)తోపాటు కెప్టెన్ ఆరోన్ జోన్స్‌ (10), మిలింద్ కుమార్‌ (4) నిరాశపర్చారు. నితీశ్‌ కుమార్‌ (30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), కోరె అండర్సన్ (29; 28 బంతుల్లో 1 సిక్స్‌), హర్మన్‌ప్రీత్‌ సింగ్ (21; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని