ENG vs PAK: ‘తీవ్రమైన ఒత్తిడిలోనూ బెన్‌ స్టోక్స్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు’

ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై  ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ఇంగ్లిష్‌ జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు. 

Published : 14 Nov 2022 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌  2010 వరకు ఒక్క ప్రపంచకప్‌ గెలవలేదు. అలాంటిది గత 12ఏళ్లలోనే మూడు (రెండు టీ20 ప్రపంచకప్‌లు 2010, 2022, వన్డే ప్రపంచకప్‌ 2019) ప్రపంచకప్‌లను తన ఖాతాలో వేసుకుని తిరుగులేని జట్టుగా అవతరించింది. ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై  ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు క్రికెట్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ఇంగ్లిష్‌ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

  • ‘రెండో టీ20 ప్రపంచకప్‌ని సాధించిన ఇంగ్లాండ్‌కు అభినందనలు. అద్భుతమైన విజయం. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ ఇది. షహీన్‌ అఫ్రిది గాయపడకపోతే మరింత ఆసక్తికరంగా ఉండేది. మలుపులతో కూడిన వరల్డ్‌ కప్‌’- సచిన్‌ తెందూల్కర్‌   
  • ‘ఇది ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌లో అద్భుత విజయం. బాగా ఆడారు’-  ఇర్ఫాన్‌ పఠాన్
  • ‘సోదరులకు అభినందనలు. తీవ్రమైన ఒత్తిడిలోనూ బెన్‌ స్టోక్స్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు’- యువరాజ్‌ సింగ్‌ 
  • ‘దూకుడుగా ఆడుతూ క్రికెట్ ప్రపంచానికి మంచి వినోదాన్ని పంచుతోన్న ఇంగ్లాండ్‌కు అభినందనలు. పాకిస్థాన్‌ చివరి వరకు పట్టుదలగా పోరాడింది’- సనత్‌ జయసూర్య







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని