T20 Cricket: 27 బంతుల్లోనే టీ20 సెంచరీ.. సాహిల్ చౌహన్‌ అరుదైన రికార్డు

టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల దెబ్బకు రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. తాజాగా ఓ బ్యాటర్లు రికార్డు స్థాయిలో సెంచరీ సాధించాడు.

Updated : 18 Jun 2024 13:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మూలాలు కలిగిన బ్యాటర్లు ప్రపంచమంతా అదరగొట్టేస్తున్నారు. టీ20 ప్రపంచ కప్‌లో భారత వారసత్వం కలిగిన క్రికెటర్లు యూఎస్‌ఏకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఓ ఆటగాడు ఎస్తోనియా తరఫున ఆడుతూ కేవలం 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. సైప్రస్‌పై ఎస్తోనియా క్రికెటర్ సాహిల్ చౌహాన్ ఈ ఘనత నమోదు చేశాడు. ఇప్పటి వరకు కేవలం నాలుగు టీ20లను మాత్రమే ఆడిన అతడు 162 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఇప్పుడు సైప్రస్‌పై చేసిన 144 పరుగులు ఉండడం గమనార్హం. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జాన్‌ నికోల్ (33 బంతుల్లో) రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌ టీ20 ఫార్మాట్‌ చరిత్రలోనే గేల్ (30 బంతుల్లో సెంచరీ) రికార్డును సాహిల్‌ బ్రేక్‌ చేశాడు.

ఆరు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సైప్రస్ 191/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సాహిల్ చౌహాన్ (41 బంతుల్లో 144*: ఆరు ఫోర్లు, 18 సిక్స్‌లు) దూకుడుగా ఆడేశాడు. దీంతో లక్ష్యాన్ని ఎస్తోనియా కేవలం 13 ఓవర్లలోనే పూర్తి చేసింది. సాహిల్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని