Ravi shastri: నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్‌కు రవిశాస్త్రి గట్టి కౌంటర్

టీ20 వరల్డ్ కప్‌ టోర్నీ నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకెల్ వాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. 

Published : 06 Jul 2024 17:22 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమ్ఇండియా నిలిచింది. సెమీ ఫైనల్‌లో రోహిత్‌ సేన.. ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. దీంతో 2022 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్ మ్యచ్‌లో దక్షిణాఫ్రికాను భారత జట్టు మట్టికరిపించి టీ20 ప్రపంచ కప్‌ని చేజిక్కించుకుంది. 

దక్షిణాఫ్రికాతో జరిగిన మరో సెమీస్‌లో అఫ్గానిస్థాన్‌ ఓటమిపాలైన అనంతరం వాన్ మాట్లాడాడు. టోర్నమెంట్ షెడ్యుల్‌ను ప్రస్తావిస్తూ.. నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపించాడు. అఫ్గాన్‌ ఆటగాళ్లు సెమీస్‌ కోసం ట్రినిడాడ్‌కు వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యమైందని తెలిపాడు. దీంతో వారికి ప్రాక్టీస్ చేసే సమయం కూడా దొరకలేదన్నాడు. ఐసీసీ.. భారత్‌కు అనుకూలంగా వ్యవహరించిందని వాన్‌ ఆరోపించడంపై రవిశాస్త్రి గట్టిగానే స్పందించాడు. ‘‘మైకెల్ వాన్‌ ఏది పడితే అది మాట్లాడుతాడు. అతని మాటలను భారత్‌లో ఎవరూ పట్టించుకోరు. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ ఎందుకు విఫలమైందనే దానిపై అతడు దృష్టిపెడితే మంచిది. భారత్‌ నాలుగు ట్రోఫీలు సాధించింది. ఇంగ్లాండ్‌ రెండు సార్లు కప్పు గెలిచింది. కానీ, మైకెల్ వాన్‌ ఒక్కసారైనా ప్రపంచ కప్ సాధించలేదు’’ అని రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని