IND vs NZ: రహానె, పుజారాలకు.. టీమ్ఇండియా అండగా ఉంది : పరాస్‌ మాంబ్రే

గత కొద్దికాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న సీనియర్‌ బ్యాటర్లు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలకు టీమ్‌ఇండియా అండగా ఉందని టీమ్‌ఇండియా కొత్త బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే..

Published : 02 Dec 2021 01:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత కొద్దికాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న సీనియర్‌ బ్యాటర్లు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలకు టీమ్‌ఇండియా అండగా ఉందని టీమ్‌ఇండియా కొత్త బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే అన్నాడు. టెస్టు క్రికెట్లో వాళ్లకు తగినంత అనుభవం ఉందని.. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్‌  దూరంలోనే ఉన్నారని చెప్పాడు. గత రెండు సంవత్సరాలుగా రహానె ఫామ్ లేమితో వరుసగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, టెస్టు స్పెషలిస్ట్ పుజారా కూడా గత 16 టెస్టుల్లో ఒక్క శతకం కూడా నమోదు చేయకుండా కొనసాగుతున్నాడు.
 
‘టెస్టు క్రికెట్లో అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారాలకు తగినంత అనుభవం ఉంది. వీరిద్దరూ కలిసి చాలా సార్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్‌ దూరంలోనే ఉన్నారు. అందుకే, ఓ జట్టుగా మేమంతా వాళ్లకు అండగా నిలబడ్డాం. వారి నుంచి టీమ్ఇండియా ఏమి ఆశిస్తుందో వారికి బాగా తెలుసు. వారిద్దరూ పుంజుకుంటే మిడిలార్డర్‌ మరింత బలోపేతమవుతుంది’ అని పరాస్‌ మాంబ్రే అభిప్రాయపడ్డాడు. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 3 నుంచి ముంబయి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టుకి కెప్టెన్ విరాట్‌ కోహ్లి అందుబాటులోకి రానుండటంతో.. తుదిజట్టులో రహానెకు చోటు లభిస్తుందా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది! 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని