Rishabh: కాంబినేషన్‌ కుదిరింది.. పంత్‌కు అవకాశం కష్టమే!: భారత మాజీ సెలెక్టర్‌

రిషభ్ పంత్‌.. దినేశ్ కార్తిక్‌.. టీ20 ప్రపంచకప్‌లో స్థానం కోసం వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అయితే ఫినిషర్‌గా అక్కరకొస్తాడని అంచనాతో గత కొన్ని మ్యాచుల...

Published : 29 Sep 2022 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిషభ్ పంత్‌.. దినేశ్ కార్తిక్‌.. టీ20 ప్రపంచకప్‌లో స్థానం కోసం వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అయితే ఫినిషర్‌గా అక్కరకొస్తాడన్న అంచనాతో గత కొన్ని మ్యాచుల నుంచి దినేశ్ కార్తిక్‌ను టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తోంది. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌కు అవకాశం లభిస్తుందా...? లేదా..? అనే చర్చ కొనసాగుతోంది. అయితే రవీంద్ర జడేజా వంటి నాణ్యమైన లెఫ్ట్‌ ఆర్మ్‌ బ్యాటర్‌ లేకపోవడంతో పంత్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌ బరిలోకి దిగేముందు టీమ్‌ఇండియా చివరిసారిగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడుతోంది. తొలి టీ20లో దినేశ్ కార్తిక్‌తోపాటు రిషభ్‌ పంత్‌కూ అవకాశం కల్పించింది. కానీ బ్యాటింగ్‌ చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఇంతకుముందు వచ్చిన అవకాశాలను రిషభ్ పంత్‌ పెద్దగా అందిపుచ్చుకోలేదు. పొట్టి ఫార్మాట్‌లో మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. అయితే ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో కార్తిక్‌ మాత్రం తన ‘ఫినిషర్‌’ పాత్రకు న్యాయం చేశాడు. ఈ క్రమంలో రిషభ్ పంత్‌కు అవకాశంపై టీమ్‌ఇండియా మాజీ సెలెక్టర్‌ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘రిషభ్‌ పంత్‌ను కాదని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ దినేశ్ కార్తిక్‌ వైపు మొగ్గు చూపడం మంచి నిర్ణయంగా అనిపిస్తోంది. ఆరో స్థానంలో కార్తిక్‌ లాంటి హిట్టర్‌ ఉండాలనుకోవడం తప్పేమీలేదు. రిషభ్‌ పంత్‌ను అలాంటి పాత్రలో ఎప్పుడూ ప్రయత్నించలేదు. అందుకే రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో అవకాశం వస్తుందా..?అనేది నా అనుమానం. ఎందుకంటే ఇప్పటికే మంచి కాంబినేషన్‌ టీమ్‌ఇండియాకు దొరికిందని భావిస్తున్నా’ అని సబా కరీం విశ్లేషించాడు. అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌తో తలపడనుంది. ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును టీమ్‌ఇండియా ప్రకటించింది. దినేశ్‌ కార్తిక్‌తోపాటు రిషభ్‌ పంత్‌నూ ఎంపిక చేసింది. అయితే తుది జట్టులో ఎవరుంటారనేది మిలియన్‌డాలర్ల ప్రశ్న. దానికి సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని