IND vs SA: రాహుల్‌ ఇన్నింగ్స్ సూపర్‌.. విమర్శలు అర్థరహితం: భారత మాజీ ఆటగాడు

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే 107 పరుగుల లక్ష్య ఛేదనలో...

Published : 29 Sep 2022 14:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (51 నాటౌట్‌: 56 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు) నెమ్మదిగా ఆడాడు. పిచ్‌ కఠినంగా ఉందని, ఇలాంటి వికెట్‌పై ఆడటం తేలికైన విషయం కాదని కెప్టెన్‌ రోహిత్ శర్మ కూడా అంగీకరించాడు. ఈ క్రమంలో రాహుల్‌ ‘స్లో’ ఇన్నింగ్స్‌పైనా సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు చురకలు అంటించాడు. కేఎల్ రాహుల్‌ ఆడిన టాప్‌ క్వాలిటీ ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. 

‘‘దక్షిణాఫ్రికాతో టీ20లో భారత బ్యాటర్‌ కేఎల్ రాహుల్‌ ఆడిన విధానాన్ని విమర్శించడం సరైంది కాదు. ఇక్కడ ‘విమర్శ’ అనేది దుర్వినియోగం అయినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థి 20 ఓవర్లలో కేవలం 106 పరుగులకే పరిమితమైంది. అలాగే మన టీమ్‌ కూడా స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లను చేజార్చుకొంది. కేఎల్ రాహుల్‌ అత్యుత్తమ ప్రమాణాలతో ఆడిన ఇన్నింగ్స్‌ ఇది. ఇరు జట్లూ అద్భుతంగా ఆడాయి’’ అని ట్విటర్‌ వేదికగా ఆకాశ్‌ చోప్రా తెలిపాడు. 17 పరుగులకే రోహిత్, విరాట్ కోహ్లీ వికెట్లను నష్టపోయిన భారత్‌ను సూర్యకుమార్‌ (50*)తో కలిసి రాహుల్‌ విజయతీరాలకు చేర్చాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని