Umran Malik: నేనైతే ఉమ్రాన్‌ మాలిక్‌ను ఎంపిక చేసేవాడిని.. ఎందుకంటే?: మాజీ చీఫ్‌ సెలెక్టర్‌

టీ20 ప్రపంచకప్‌ జట్టు నుంచి జస్ప్రీత్ బుమ్రా వైదొలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ వెంగ్‌సర్కార్‌ స్పందించాడు.

Published : 30 Sep 2022 18:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జస్ప్రీత్ బుమ్రా.. టీమ్‌ఇండియా సీనియర్ పేసర్. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నుంచి వైదొలిగాడు. బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. షమీకి కరోనా నెగిటివ్‌ వచ్చినా.. విశ్రాంతినిస్తూ నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచ కప్‌నకూ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. దీంతో షమీ లేదా దీపక్‌ చాహర్‌లో ఒకరిని ప్రధాన జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. అప్పుడు స్టాండ్‌ బై ఆటగాడిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరిని ప్రధాన జట్టులోకి తీసుకొంటారు.. ఏ ఆటగాడికి స్టాండ్‌బైలో ఛాన్స్‌ వస్తుందనే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌, మాజీ కెప్టెన్‌ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా స్పందించాడు. షమీ, సిరాజ్‌ కాకుండా యువ బౌలర్‌ వైపు వెంగ్‌సర్కార్ మొగ్గు చూపడం గమనార్హం. 

యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్‌ టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్నాడని వెంగ్‌సర్కార్ తెలిపాడు. అందుకే అతడు కూడా జట్టులో ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ‘‘టీమ్‌ఇండియా కూర్పునకు సంబంధించి ఆలోచించడానికి ఏమీ లేదు. బుమ్రా లేకపోతే నేను ఉమ్రాన్‌ మాలిక్‌ను ఎంపిక చేస్తా. ఎందుకంటే అతడి వేగమే అందుకు ప్రధాన కారణం. 150కి.మీ వేగంతో బంతులను సంధించగలడు. ఒకవేళ అతడు 130 కి.మీ స్పీడ్‌తో బౌలింగ్‌ వేసేవాడైతే ఎంపిక చేసేవాడిని కాదు. దుబాయ్‌లో అయితే పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ, ఆస్ట్రేలియా పిచ్‌లు పేస్‌, బౌన్స్‌కు సహకారం అందిస్తాయి. అందుకే ఫాస్ట్‌ బౌలర్లు కావాలనేది నా అభిప్రాయం. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్‌ గిల్‌, మహమ్మద్ షమీ.. టీమ్‌ఇండియా ప్రధాన జట్టులో ఉండుంటే బాగుండేది. శ్రేయస్‌ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు’’ అని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts