MS Dhoni: గుజరాత్‌తో మ్యాచ్‌.. ధోనీ కాస్త నిరాశగా కనిపించాడు: సంజయ్ మంజ్రేకర్

గతేడాది లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన చెన్నై సూపర్‌ కింగ్స్ (CSK) అద్భుతమైన ఆటతీరుతో ఈసారి ఫైనల్‌కు చేరింది. కెప్టెన్‌ ధోనీ వ్యూహాలకు మరోసారి తిరుగులేదని నిరూపించాడు.

Published : 25 May 2023 13:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్‌ (GT vs CSK) ఐపీఎల్ 2023 సీజన్‌  ఫైనల్‌కు (IPL 2023) దూసుకెళ్లింది. అయితే, మ్యాచ్‌ సందర్భంగా అంపైర్లతో సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ చర్చించడంపై సోషల్‌ మీడియాలో విభిన్నంగా స్పందనలు వస్తున్నాయి. యువ పేసర్ పతిరణను బౌలింగ్‌ తీసుకొచ్చేందుకు ధోనీ కావాలనే అలా చేశాడని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఇలా వారి మధ్య చర్చ జరిగింది. చివరికి పతిరణ బౌలింగ్‌ వేసేందుకు అంపైర్లు అవకాశం ఇవ్వడంతో అక్కడితో సమస్య ముగిసిపోయింది. తాజాగా దానిపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్ విశ్లేషించాడు. 

‘‘ధోనీ - అంపైర్ల మధ్య ఏం జరిగిందో తెలియదు. పతిరణ తొమ్మిది నిమిషాల పాటు బయట ఉన్నట్లు తెలిసింది. అంపైర్లతో ధోనీ చర్చించిన సమయం కూడా కౌంట్ చేస్తారో లేదో కూడా తెలియదు. చివరి పతిరణకు బౌలింగ్‌ వేయడానికి అనుమతి వచ్చింది. ఇదంతా ధోనీకి ఫేవర్‌గా జరిగిపోయింది. ఆ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ కాస్త నిరాశగా ఉన్నాడనిపించింది. రషీద్ ఖాన్‌ ఎలా ఆడతాడనేది తెలుసు. అందుకే, తాను ఎంతో నమ్మకంగా ఉండేవారికే బంతిని ఇవ్వాలని భావించాడు. ఇదొక వ్యూహం. అద్భుతంగా పని చేసింది’’ అని సంజయ్‌ తెలిపాడు. 

ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడే జట్టేదో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే. మొదటి క్వాలిఫయర్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌ - ఎలిమినేటర్‌ విజేత ముంబయి ఇండియన్స్ మధ్య రెండో క్వాలిఫయర్‌ జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు టైటిల్‌ కోసం సీఎస్‌కేతో తలపడనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని