Published : 30 Jun 2022 01:52 IST

అప్పట్లో టీమ్‌ఇండియాపై సూపర్‌ ఓపెనింగ్‌ స్పెల్‌.. ట్రోలింగ్‌కు గురైన పాక్‌ మాజీ పేసర్!

(ఫొటో సోర్స్‌: ట్విటర్)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ చిన్న అవకాశం దొరికినా చాలు.. టీమ్‌ఇండియాపై ఆధిపత్యం తమదేనని చెప్పేందుకు పాకిస్థాన్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. దీంతో ట్వీట్లు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వెంటనే నెటిజన్ల ట్రోల్స్‌కు గురవ్వక తప్పడం లేదు. తాజాగా ఈ కోవలోకే పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ జునైద్ ఖాన్‌ చేరాడు. 2012లో చెన్నై వేదికగా జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో జునైద్ ఖాన్‌ అద్భుతమైన స్పెల్ వేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 226/7 స్కోరు చేసింది. అనంతరం పాక్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఓపెనింగ్‌ స్పెల్‌లోనే విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్‌ సింగ్ వికెట్లను చకచకా తీశాడు. అంతేకాకుండా రోహిత్ శర్మను కూడా ఔట్‌ చేసి (4/43) అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసి సంచలనం సృష్టించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘‘నేను చూసిన అద్భుతమైన బౌలింగ్‌ స్పెల్‌లో ఇదొకటి’ అని ఓ క్రికెట్ అభిమాని ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ట్వీట్‌కు స్పందించిన జునైద్ ఖాన్‌ ‘‘ఇది నా జీవితంలో కీలకమైన మైలురాయి. టర్నింగ్‌ పాయింట్‌ కూడా ఇదే. దీనికి మీరేమంటారు?’’ అని రీట్వీట్ చేశాడు. అయితే ఒక్కసారిగా ట్రోలింగ్‌కు గురి కావడంతో వీడియోను సదరు క్రికెట్ అభిమాని డిలీట్ చేసేయడం విశేషం. అయినప్పటికీ నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌ మాత్రం ఆగడం లేదు. 

‘‘అసలు నీకంటూ కెరీర్‌ ఉందా..?’’.. 

‘‘ఇది మంచి స్పెల్లే కానీ. ఇలాంటి ప్రదర్శన మరెప్పుడూ చేయలేదు. చెన్నై పిచ్‌ పరిస్థితులు, నీ ఫిట్‌నెస్ వల్లే అంత మంచి స్పెల్‌ వేసి ఉండొచ్చు’’

‘‘అది ఓకే.. ఆ తర్వాత ఏం చేశావు..?’’

‘‘ఈ ఫీట్ తర్వాత నీ పేస్‌ను తగ్గించావు. ఫిట్‌నెస్‌పై సరైన దృష్టి పెట్టలేదు. లేకపోతే నువ్వు మరొక వసీమ్‌ అక్రమ్‌లా తయారు అయ్యేవాడివి’’

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని