రెండో టెస్టుకు ఫ్యాన్స్.. నిబంధనలు తెలుసా?
భారత్, ఇంగ్లాండ్ తలపడే రెండో టెస్టును వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని స్టేడియంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వీక్షకులు పాటించాల్సిన నిబంధనలను వెల్లడించారు....
చెన్నై: భారత్, ఇంగ్లాండ్ తలపడే రెండో టెస్టును వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని స్టేడియంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. వీక్షకులు పాటించాల్సిన నిబంధనలను వెల్లడించారు.
కొవిడ్-19 వల్ల గతేడాది నుంచి భారత్‌లో క్రికెట్ జరగలేదు. ఇంగ్లాండ్ సిరీసుతోనే క్రికెట్ ఆరంభమైంది. ఆంక్షలు ఉండటంతో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకు అభిమానులను అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించడంతో రెండో టెస్టు నుంచి వీక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. దాదాపు 15వేల మందికి మ్యాచును వీక్షించే అవకాశం ఉంది.
‘రెండో టెస్టును వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి. జ్వరం, దగ్గు, జలుబు వంటి కొవిడ్ లక్షణాలుంటే లోనికి అనుమతించరు’ అని తమిళనాడు క్రికెట్ సంఘం తెలిపింది. వీక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జాతి వివక్ష, మత వివక్ష, అశ్లీల పదజాలం ఉపయోగించకూడదని పేర్కొంది. క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
స్టేడియంలోకి బైనాక్యులర్లు, స్పీకర్లు, సంగీత పరికరాలు వంటివి తీసుకురావద్దని నిర్వాహకులు తెలిపారు. ‘సంచులు, బ్రీఫ్‌కేసులు, రేడియోలు, లేజర్ పాయింటర్లు, డిజిటల్ డైరీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టేప్ రికార్డర్లు, రికార్డింగ్ పరికరాలు, బైనాక్యులర్లు, రిమోట్ నియంత్రిత వస్తువులు, మందుగుండు సామగ్రి, సంగీత పరికరాలు, స్పీకర్లు, ప్రొఫెషనల్/వీడియో కెమేరాలు తీసుకురావడం నిషేధం’ అని పేర్కొన్నారు. 2012 నుంచి మూసేసిన ఐ, జే, కే స్టాండ్లను తెరుస్తున్నామని వెల్లడించారు.
ఇవీ చదవండి
పంత్‌కే ఐసీసీ తొలి పురస్కారం
లోకల్ బాయ్స్ ఆల్‌రౌండ్ షో
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్