Suresh Raina : గుజరాత్ టైటాన్స్‌ జట్టులోకి సురేశ్‌ రైనా.?

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌-2022 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) మాజీ స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడునున్నాడనే ఫేక్‌ న్యూస్‌ ఒకటి సామాజిక..

Published : 03 Mar 2022 15:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌-2022 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) మాజీ స్టార్‌ ఆటగాడు సురేశ్‌ రైనా గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడనున్నాడనే ఫేక్‌ న్యూస్‌ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ వేలంలో గుజరాత్ యాజమాన్యం ఇంగ్లాండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ని సొంతం చేసుకుంది. అయితే, వ్యక్తిగత కారణాల రీత్యా అతడు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో గుజరాత్ జట్టులో ఓ స్థానం ఖాళీ అయ్యింది. అతడి స్థానంలో సురేశ్‌ రైనాను తీసుకోవాలని క్రికెట్ అభిమానులు కొందరూ గుజరాత్ జట్టు యాజమాన్యానికి సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఈ విషయంపై ఇటు గుజరాత్ టైటాన్స్‌ యాజమాన్యం కానీ, సురేశ్‌ రైనా కానీ స్పందించలేదు. దీంతో ఈ వార్తలు ఫేక్‌ అనే విషయం స్పష్టమవుతోంది.

దూకుడైన ఆటతీరుతో మిస్టర్ ఐపీఎల్‌గా పేరు పొందిన సురేశ్‌ రైనా గతేడాది వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కోల్పోయి ఇబ్బంది పడుతున్న రైనాను చెన్నై యాజమాన్యం పక్కన పెట్టింది. బహిరంగ వేలంలో కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఐపీఎల్‌లో 205 మ్యాచులు ఆడిన రైనా.. 32.52 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇతడి కంటే ముందు విరాట్‌ కోహ్లీ (6,283), శిఖర్‌ ధావన్‌ (5,784), రోహిత్‌ శర్మ (5,611) ముందున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని