Roger Federer: నా పిల్లలకు మీ కథలు చెప్పినందుకు గర్వంగా ఉంది: నటి ఇషా గుప్తా

ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తన కెరీర్‌ చివరి మ్యాచ్‌ను శుక్రవారం ఆడాడు. తన చిరకాల ప్రత్యర్థి రఫేల్‌ నాదల్‌తోనే..........

Published : 25 Sep 2022 01:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తన కెరీర్‌ చివరి మ్యాచ్‌ను శుక్రవారం ఆడాడు. తన చిరకాల ప్రత్యర్థి రఫేల్‌ నాదల్‌తోనే జతకట్టి అతడు ఈ పోరులో దిగడం విశేషం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఫెదరర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఇషా గుప్తా సైతం ఆ జాబితాలోకి చేరింది. తన అభిమాన అథ్లెట్‌కు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపింది. రోజర్‌ను ‘ఆల్‌టైం అత్యుత్తమ అథ్లెట్‌’గా పేర్కొంటూ.. టెన్నిస్‌ ఆటకే అందాన్ని తెచ్చాడంటూ కొనియాడింది.

‘టెన్నిస్‌లో అత్యుత్తమంగా మాత్రమే కాకుండా అన్ని కాలాల్లోనూ ఉత్తమ అథ్లెట్‌గా నిలిచి ఆటకు అందం, గౌరవం తీసుకొచ్చిన రోజర్ ఫెదరర్‌కు ధన్యవాదాలు. ఆ రాకెట్‌తో మీరు కోర్టులో గీసిన ఎన్నో కళాఖండాలను చూడగలిగినందుకు, నా పిల్లలకు మీ కథలు చెప్పగలిగినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇకపైనా  మీరు మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నా. అత్యంత వినయం గల వ్యక్తిగా ఉంటూ టెన్నిస్‌ను మరింత అందమైన క్రీడగా మార్చినందుకు ధన్యవాదాలు.. మీ అభిమాని’ అంటూ ఫెదరర్‌పై ఉన్న అభిమానాన్ని ఇషా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇలా వెల్లడించింది.

ఆసాంతం ఉద్వేగభరితంగా..

ప్రొఫెషనల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన స్విస్‌ మాస్టర్‌ రోజర్ ఫెదరర్‌ తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను రఫెల్‌ నాదల్‌తో జోడీగా ఆడాడు. శుక్రవారం జరిగిన లేవర్‌ కప్ డబుల్స్‌ మ్యాచ్‌లో టీమ్‌ యూరోప్‌ తరఫున ఫెదరర్‌, నాదల్‌.. అమెరికా ఆటగాళ్లు ఫ్రాన్సిస్‌ తియాఫో, జాక్‌ సాక్‌తో తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌, నాదల్‌ జోడీ.. ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌తో ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌ ముగిసింది. దీంతో మ్యాచ్‌ అనంతరం అతడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. తన  సహచరుడైన నాదల్‌తో పాటు తోటి ఆటగాళ్లను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫెదరర్‌ను చూసి తట్టుకోలేక నాదల్‌ కూడా కంటతడిపెట్టాడు. దీంతో కోర్టు ప్రాంగణమంతా ఒక్కసారి ఉద్విగ్నంగా మారింది. ఈ ఆటకు హాజరైన దిగ్గజాలు జకోవిచ్‌, ఆండీ ముర్రేతోపాటు పలువురు భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్షణాల మధ్యే అభిమానులకు అభివాదం చేస్తూ ఆటకు రోజర్‌ వీడ్కోలు పలికాడు.Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని