FIFA World Cup : బైనాక్యులర్‌లో ఆల్కహాల్‌ తీసుకువచ్చి.. సెక్యూరిటీకి చిక్కి..

ఫిఫా ప్రపంచకప్‌ మైదానాల్లో ఆల్కహాల్‌ వినియోగంపై నిషేధం విధించడం.. పలువురు అభిమానులను నిరాశకు గురిచేసింది. దీంతో దొంగదారుల్లో స్టేడియంలోకి ఆల్కహాల్‌ను తీసుకొస్తూ  సెక్యూరిటీకి చిక్కుతున్నారు.

Published : 25 Nov 2022 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తమ జట్లకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియాలకు తరలివస్తున్నారు. అయితే ఈ సారి మైదానాల్లో ఆల్కహాల్‌ వినియోగంపై నిషేధం విధించడం.. పలువురిని నిరాశకు గురిచేసింది. దీంతో దొంగదారుల్లో స్టేడియంలోకి మద్యం తీసుకొచ్చేందుకు అభిమానులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ అభిమాని ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు బైనాక్యులర్‌లో మద్యం తీసుకొచ్చాడు. చివరికి సెక్యూరిటీకి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఓ మెక్సికో అభిమాని బైనాక్యులర్‌ మధ్య భాగంలో చిన్న డబ్బా ఏర్పాటు చేసుకొని.. అందులో మద్యం తీసుకొచ్చాడు. అయితే భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చి పరిశీలించాడు. దాని లెన్స్‌ తొలగించి చూడగా  అసలు విషయం బయటపడింది. ఇదేంటని అడిగితే.. హ్యాండ్‌ శానిటైజర్‌ అని ఆ అభిమాని చెప్పడం గమనార్హం.

ఇస్లామిక్‌ దేశాల్లో ఆల్కహాల్‌పై ఎక్కువగా నిషేధం ఉంటుంది. ఖతార్‌లో ఈ ప్రపంచకప్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందే.. స్టేడియం పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై బ్యాన్‌ విధించడం అభిమానులను నిరాశకు గురిచేసింది. మ్యాచ్‌లు జరిగే ఎనిమిది స్టేడియం పరిసరాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అభిమానులకు బీర్లు విక్రయించకూడదని ఫిఫా వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు