Robin Uthappa: డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ రాబిన్‌ ఉతప్ప.. నెట్టింట్లో వైరల్‌

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో రాబిన్ ఉతప్ప (Robin Uthappa) ముందుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాబిన్‌.. తాజాగా యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు.

Published : 20 Jan 2023 01:45 IST

ఇంటర్నెట్ డెస్క్: వైట్ బెల్ట్, గ్రీన్‌ బెల్ట్, బ్లాక్‌ బెల్ట్‌.. ఇవి రెజ్లింగ్‌ వీరులకు   ఇచ్చే అవార్డులు.. అయితే టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కూడా గ్రీన్‌ బెల్ట్‌ను దక్కించుకోవడం విశేషం. ఇదేంటి.. ఉతప్ప క్రికెట్‌ ఆడటం మానేసిన తర్వాత రెజ్లింగ్‌లోకి వెళ్లాడా..? అనే అనుమానం కలగకమానదు. అయితే మీరు పొరబాటు పడినట్టే.. ఎందుకంటే రాబిన్ ఉతప్ప ఎలాంటి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొనలేదు. అతడు క్రికెట్‌ మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతోనే గ్రీన్‌ బెల్ట్‌ సొంతమైంది. దీంతో సోషల్‌ మీడియాలో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ రాబిన్‌ ఉతప్ప అనే కామెంట్లతో నెటిజన్లు చెలరేగిపోయారు. 

యునైట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఐఎల్‌టీ 20 లీగ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో గల్ఫ్‌ జెయింట్స్‌పై కేవలం 46 బంతుల్లోనే 79 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో గ్రీన్‌ బెల్ట్‌ను ప్రదానం చేశారు. ఈ క్రమంలో గ్రీన్‌ బెల్ట్‌ అందుకొన్న తొలి ప్లేయర్‌గా రాబిన్‌ ఉతప్ప అవతరించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్స్‌ విజేతగా నిలిచిన తర్వాత ఇలాంటి బెల్ట్‌లను అందిస్తారని.. అభిమానులు సరదాగా కామెంట్లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని