రెండో టెస్టు: టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు

భారత్‌లో క్రికెట్‌ మ్యాచులు జరుగుతున్నాయంటే స్టేడియాల్లో సందడి ఎలా ఉండేది? మైదానాలు కిక్కిరిసిపోయేవి. టికెట్ల కోసం అభిమానులు స్టేడియాల ముందు బారులు తీరేవారు. టికెట్‌ దొరికితే అదృష్టంగా భావించేవారు. మైదానంలోకి వెళ్లాక అరుపులు.. కేకలతో హోరెత్తించేవారు....

Published : 11 Feb 2021 20:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో క్రికెట్‌ మ్యాచులు జరుగుతున్నాయంటే స్టేడియాల్లో సందడి ఎలా ఉండేది? మైదానాలు కిక్కిరిసిపోయేవి. టికెట్ల కోసం అభిమానులు స్టేడియాల ముందు బారులు తీరేవారు. టికెట్‌ దొరికితే అదృష్టంగా భావించేవారు. మైదానంలోకి వెళ్లాక అరుపులు.. కేకలతో హోరెత్తించేవారు.

కరోనా మహమ్మారి రాకతో ఏడాదిగా అభిమానులు ప్రత్యక్షంగా క్రికెట్‌ అనుభూతిని పొందలేకపోతున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి తగ్గడం, ప్రజల్లో అవగాహన రావడంతో కేంద్ర ప్రభుత్వం షరతులతో వీక్షకులకు అనుమతి ఇచ్చింది. దాంతో భారత్‌×ఇంగ్లాండ్‌ రెండో మ్యాచుకు అభిమానులను అనుమతించారు. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి. స్టేడియం సామర్థ్యంలో 50% వరకు టికెట్లు ఇస్తున్నారు. రెండో టెస్టు టికెట్ల పంపిణీని గురువారం ఆరంభించారు.

చెపాక్‌లో ఫిబ్రవరి 13 నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. చిదంబరం స్టేడియం టికెట్‌ కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో నిలబడ్డారు. తమకిష్టమైన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడొచ్చన్న ఉద్దేశంతో యువకులు ఎక్కువగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. వాటిని చూసి మురిసిపోతున్నారు. దీంతో స్టేడియం వద్ద సందడి నెలకొంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఇవీ చదవండి
కుల్‌దీప్‌ ఎంపికలో పక్షపాతమా?
ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని