Gautam Gambhir : మిస్టర్‌ 360పై గంభీర్‌ విమర్శలు.. మండిపడ్డ ఆర్సీబీ అభిమానులు

మిస్టర్‌ 360 ఆటగాడిగా పేరున్న ఏబీ డివిలియర్స్‌(AB De Villiers)పై గౌతం గంభీర్‌(Gautam Gambhir) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో అతడిపై ఆర్బీబీ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు.

Published : 06 Mar 2023 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ప్రపంచ ఉత్తమ క్రికెటర్లలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌(AB de Villiers) ఒకరు. ఐపీఎల్‌(IPL) ద్వారా ఇటు భారత్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన ఆటతో బెంగళూరు జట్టు(RCB)కు ఎన్నో విజయాలను అందించాడు ఈ మిస్టర్‌ 360(Mr 360). అయితే ఈ ఆటగాడిపై భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir) తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో బెంగళూరు జట్టు అభిమానులు అతడిపై సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆర్సీబీతో దశాబ్ద కాలంపాటు అనుబంధం ఉన్న ఏబీడీ.. కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని గంభీర్‌ అన్నాడు. ‘చిన్నస్వామి స్టేడియంలాంటి చిన్న మైదానాల్లో ఏబీ డివిలియర్స్‌లా 8-10 సంవత్సరాలు ఆడితే.. ఏ ఆటగాడికైనా అదే స్ట్రైక్‌ రేటు, సామర్థ్యం ఉండొచ్చు. సురేశ్‌ రైనా 4 ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచాడు. దురదృష్టవశాత్తు ఏబీడీకి వ్యక్తిగత రికార్డులు మాత్రమే ఉన్నాయి’ అంటూ గంభీర్‌ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఆర్సీబీ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో వారు సోషల్‌ మీడియాలో గంభీర్‌పై ట్రోలింగ్‌కు దిగారు.

చిన్నస్వామి స్టేడియంలో గంభీర్‌ ఓపెనర్‌గా ఆడిన 11 ఇన్నింగ్స్‌లో 30.2 యావరేజ్‌ మాత్రమే ఉందని.. అదే ఏబీడీ 61 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు అంతకంటే దిగువ స్ధానంలో ఎక్కువ సార్లు  బ్యాటింగ్‌ చేసి 43.56 యావరేజ్‌ సంపాదించాడని బెంగళూరు అభిమానులు పేర్కొంటున్నారు. గంభీర్‌ ఓ రాజకీయ నేత అని.. ప్రత్యర్థులపై ఎప్పుడూ చెడుగా మాట్లాడటమే వారికి అలవాటని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని