FIFA World cup 2022: మెస్సి రెండో గోల్‌పై వివాదం..!

ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో మెస్సి(Lionel Messi) చేసిన రెండోగోల్‌ వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ గోల్‌ను రెఫరీ అనుమతించడంపై ఫ్రాన్స్‌ (France) అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated : 20 Dec 2022 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌లో ఫుట్‌బాల్‌ మాంత్రికుడు లియొనెల్‌ మెస్సి(Lionel Messi) చేసిన రెండో గోల్‌పై వివాదాస్పద చర్చకు తెరలేచింది. మ్యాచ్‌ అదనపు సమయలో చేసిన ఈ గోల్‌తో అర్జెంటీనా(Argentina) గెలుపు ముంగిటికి చేరుకొంది. కానీ, చివరి నిమిషాల్లో కిలియన్‌ ఎంబాపె ఓ పెనాల్టీని గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌(France) ఆశలను సజీవంగా ఉంచాడు. వాస్తవానికి మెస్సి(Lionel Messi) చేసిన రెండో గోల్‌ను రెఫరీలు ఇచ్చి ఉండాల్సింది కాదని ఫ్రాన్స్‌(France) అభిమానులు వాదిస్తున్నారు. మ్యాచ్‌ అదనపు సమయంలో 108వ నిమిషంలో మార్టినెజ్‌ కొట్టిన బంతి ఫ్రాన్స్‌(France) గోల్‌ కీపర్‌ హుగో లోరిస్‌ను తాకి వెనక్కు వచ్చింది. వెంటనే మెస్సి (Lionel Messi)దానిని కుడికాలితో కొట్టి గోల్‌లైన్‌ దాటించేశాడు. దీంతో అర్జెంటీనా(Argentina)కు 3-2 ఆధిక్యం లభించింది. 

ఇక్కడే తిరకాసు ఉంది. మెస్సి (Lionel Messi)బంతిని కొట్టే సమయంలో అర్జెంటీనా(Argentina)కు చెందిన రిజర్వు ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. అప్పటికి బంతి గోల్‌ లైన్‌ దాటలేదు. ఫిఫా నిబంధనల ప్రకారం గోల్‌ చేసే సమయంలో అదనపు వ్యక్తులు( గోల్‌ చేసిన జట్టు ఆటగాళ్లు, సబ్‌స్టిట్యూట్‌లు, అధికారులు) మైదానంలో ఉంటే గోల్‌ను రెఫరీలు అనుమతించకూడదు. 

గోల్‌ అనంతరం మ్యాచ్‌ను పునఃప్రారంభించే సమయంలోపు రెఫరీ ఈ విషయాన్ని గుర్తిస్తేనే గోల్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. కానీ, ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో రెఫరీ సైమన్‌ మార్సినెక్‌ ఆటను చూడటంలో నిమగ్నం కావడంతో ఈ విషయాన్ని గుర్తించలేదు. మరో వైపు మ్యాచ్‌ అధికారులు కూడా గుర్తించలేదని యూరోస్పోర్ట్స్‌ పత్రిక పేర్కొంది. ఈ అంశంపై ఫ్రాన్స్‌(France) తమ ఫిర్యాదును నమోదు చేయొచ్చు. కానీ, ఫలితాన్ని మాత్రం మార్చలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని