Arshdeep singh: మమ్మల్ని తిట్టే హక్కు వారికుంది: ట్రోలింగ్‌పై స్పందించిన అర్ష్‌దీప్
ఆసియా కప్ సమయంలో తనపై జరిగిన ట్రోలింగ్‌పై అర్ష్‌దీప్ సింగ్ తాజాగా స్పందించాడు.
దిల్లీ: ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా 5 వికెట్ల తేడాతో భారత్‌పై పాకిస్థాన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అసిఫ్ అలీ అందించిన క్యాచ్‌ను టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వదిలేయడం కూడా ఓటమికి గల కారణాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో అతడిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. అతడి వికీపీడియా పేజీలో ‘‘అర్ష్‌దీప్ ఖలిస్థానీ నేషనల్ క్రికెట్‌కు ఆడటానికి ఎంపికయ్యాడు’’ అని కొందరు వ్యక్తులు మార్పులు చేశారు. ఈ విషయంపై స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక శాఖ.. వికీపీడియా సంబంధిత అధికారులను వివరణ కోరింది. ఆ సమయంలో తనపై జరిగిన ట్రోలింగ్ గురించి తాజాగా అర్ష్‌దీప్ స్పందించాడు.
‘‘క్రికెటర్లను, వారి ఆటను అభిమానులు ఎంతో ప్రేమిస్తారు. బాగా ఆడినప్పుడు ఎంత ఆనందపడతారో.. ఆడలేకపోయినప్పుడు సైతం అంతే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దేశం తరఫున ఆడుతున్నాం కాబట్టే మా విషయంలో వారు అంతలా భావోద్వేగానికి లోనవుతుంటారు. మాపై కోపగించుకునే హక్కు వారికుంది. క్రికెటర్‌గా ఆ రెండింటినీ మేం స్వీకరించాల్సివుంటుంది’’ అంటూ ఈ యువ ఆటగాడు తెలిపాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం న్యూజిలాండ్‌తో వన్డేల్లో ఈ ఫాస్ట్‌బౌలర్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Modi: ‘బ్లూ జాకెట్’తో ‘గ్రీన్’ మెసేజ్ ఇచ్చిన ప్రధాని మోదీ..!
-
World News
Chinese Spy Balloon: భారత్‌పై చైనా బెలూన్ గూఢచర్యం..!
-
Sports News
IND vs AUS : నాగ్‌పూర్ పిచ్‌పై ఆసీస్ అక్కసు.. భారత్‌కు అనుకూలమంటూ ఆరోపణలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: నాపై కోడిగుడ్లూ విసిరారు: చిరంజీవి
-
World News
Joe Biden: మా జోలికొస్తే ఏం చేస్తామో చూపించాం.. చైనాకు బైడెన్ గట్టి వార్నింగ్