
Kohli: విరాట్ ‘వెజిటేరియన్ కాదు.. ఎగిటేరియన్’
టీమ్‌ఇండియా కెప్టెన్‌పై నెటిజెన్ల ట్రోలింగ్..
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా తన ఆహారంలో గుడ్డు కూడా భాగమేనని చెప్పడంతో నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. కోహ్లీ వెజిటేరియన్ కాదని, ఎగిటేరియన్ అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్‌తో మాట్లాడుతూ కోహ్లీ.. 2018 నుంచే మాంసం తినడం మానేసానని చెప్పాడు. తాను వెజిటేరియన్‌గా మారిపోయినట్లు తెలిపాడు. తాజాగా ముంబయిలో క్వారంటైన్‌లో ఉన్న టీమ్‌ఇండియా సారథి ఇన్‌స్టాలో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని కోహ్లీ ఆహారంలో ఏమేం తీసుకుంటాడని అడిగాడు. దానికి స్పందించిన అతడు.. కూరగాయలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర వంటివన్నీ తింటానని బదులిచ్చాడు. దీంతో నెటిజన్లు కోహ్లీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అతడు వెజిటేరియన్ కాదని నాన్ వెజీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ముంబయిలోని ఓ హోటల్లో క్వారంటైన్‌లో ఉందనే సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ప్రత్యేక విమానంలో క్రీడాకారులు అక్కడికి బయలుదేరి వెళ్లనున్నారు.