Rashid Khan-Farooqi: రషీద్ ఖాన్‌.. ‘యూ షట్‌అప్’: అఫ్గాన్‌ పేసర్ ఫరూఖి కామెంట్ వైరల్

పైన హెడ్డింగ్‌ చూసి.. ఇదేదో అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్, ఆ జట్టు బౌలర్‌ ఫరూఖిల మధ్య వాగ్వాదం జరిగిందనుకోకండి. అసలేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి.

Published : 14 Jun 2024 16:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాపువా న్యూగినీపై అద్భుత విజయంతో అఫ్గానిస్థాన్‌ టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సూపర్-8 దశకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన ఫజల్‌హక్ ఫరూఖి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఇయాన్ బిషప్‌తో ఫరూఖి మాట్లాడాడు. ఈసందర్భంగా అఫ్గాన్‌ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఫరూఖి ‘షట్‌అప్‌’ అంటూ సంబోధించడం అందరిలోనూ నవ్వులు పూయించాయి. ఇదేంటి అంత మాట అంటే బాధపడాలి కదా..? అనే అనుమానం రాకమానదు. కానీ, ఇక్కడ ఫరూఖి సరదాగా అన్నాడు. అసలేం జరిగిందంటే?

న్యూగినీపై తన ప్రదర్శన ఎలా ఉందనేది ఫరూఖి వివరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో బిషన్‌-ఫరూఖి సంభాషణను డిస్ట్రబ్‌ చేయడానికి రషీద్ ఖాన్ వచ్చాడు. ఫరూఖిని నవ్వించేందుకు అలానే చూస్తుండిపోయాడు. దీంతో ఫరూఖి ‘యూ షట్‌అప్’ అంటూ అనడంతో పక్కనే ఉన్న బిషప్‌ వెంటనే స్పందించాడు.

బిషప్‌: ‘నన్ను కాదు కదా అన్నది?’

ఫరూఖి: మిమ్మల్ని కాదు.  రషీద్ ఖాన్‌ కోసం అలా అన్నా. (నవ్వుతూ)

బిషప్: ఈ మ్యాచ్‌లో నీ ప్రదర్శన పట్ల దేశంతోపాటు రషీద్ గర్వపడి ఉంటాడు. 

ఫరూఖి: నన్ను నవ్వించడానికి అతడు చాలా కష్టపడుతున్నాడు. కానీ నేను మాత్రం నవ్వను. (ఇది కూడా నవ్వుతూనే చెప్పడం గమనార్హం) 

ఆ తర్వాత తన ప్రదర్శనపై ఫరూఖి మాట్లాడటం కొనసాగించాడు. ‘‘ముందుగా అఫ్గాన్‌ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నా. మన జట్టు సూపర్ -8కి అర్హత సాధించింది. నాణ్యమైన క్రికెట్ ఆడటం వల్లే ఇది సాధ్యమైంది. ఐపీఎల్‌లో నేను ఆడే అవకాశం రాలేదు. ఇక్కడికి వచ్చాక బలమైన ముద్ర వేయాలని భావించా. ఇక్కడికి రెండు లక్ష్యాలతో వచ్చా. పిచ్ స్వింగ్‌ లేదా సీమ్‌కు అనుకూలంగా ఉంటే వికెట్లు తీయడం.. బౌలింగ్‌కు ఏమాత్రం సహకారం లేకపోతే మాత్రం సరైన ప్రాంతంలో బంతులేసి పరుగులు కట్టడి చేయడం. ఇదే సూత్రాలను పాటించా. సూపర్ - 8లోనూ మా అత్యుత్తమ ఆటతీరుతో గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఫరూఖి తెలిపాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు