CWG 2022: కామన్వెల్త్‌ చివరి రోజు.. మరో ఐదు స్వర్ణాలే లక్ష్యంగా..

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఈ క్రీడల్లో ఇప్పటివరకు పతకాల అర్ధసెంచరీని అందుకున్న మన దేశం.. చివరి రోజు మరో ఐదు స్వర్ణ పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కామన్వెల్త్‌

Published : 08 Aug 2022 11:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఈ క్రీడల్లో ఇప్పటివరకు పతకాల అర్ధసెంచరీని అందుకున్న మన దేశం.. చివరి రోజు మరో ఐదు స్వర్ణ పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కామన్వెల్త్‌ పోటీలకు సోమవారమే ఆఖరి రోజు. నేడు మొత్తం ఆరు పోటీల్లో భారత ఆటగాళ్లు తలపడనుండగా.. ఇందులో ఐదు ఫైనల్‌ మ్యాచ్‌లే. మరొకటి కాంస్య పోరు. దీంతో భారత్‌ ఖాతాలో మరో ఐదు పతకాలు ఖాయమే. అయితే ఇందులో ఎన్ని స్వర్ణాలు దక్కనున్నాయో చూడాలి..!

బ్యాడ్మింటన్‌లో మూడు పతకాలు..

* నేడు బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మూడు పతకాలు దక్కనున్నాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్వర్ణం కోసం మిచెలీ లీతో సింధు తలపడనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

* పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ పసిడి పోరుకు సిద్ధమయ్యాడు. మధ్యాహ్నం 2.10 గంటలకు మొదలయ్యే ఫైనల్‌ మ్యాచ్‌లో జె యంగ్‌తో అతడు పోటీపడనున్నాడు.

* పురుషుల డబుల్స్‌ ఫైనల్‌లో సాత్విక్‌ - చిరాగ్‌ జోడీ సీన్‌-బెన్‌ ద్వయంతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.50 గంటల నుంచి ప్రారంభం కానుంది.

టేబుల్‌ టెన్నిస్‌, హాకీ ఫైనల్స్‌..

* టేబుల్ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాగే ఈ మ్యాచ్‌లో కమల్.. లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌తో పోటీపడనున్నాడు.

* అటు హాకీ పురుషుల జట్టు కూడా ఫైనల్‌కు చేరింది. పసిడి పోరులో మన జట్టు.. ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ మ్యాచ్‌ మొదలుకానుంది.

* ఇక, టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో కాంస్య పతకం కోసం సతియాన్‌.. పాల్‌ డ్రింక్‌హాల్‌తో పోటీపడనున్నాడు. మధ్యాహ్నం 3.35 గంటల నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని