ప్చ్‌.. సింధుకు నిరాశ!

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ను విజయంతో ఆరంభించాలనుకున్న భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. గ్రూప్‌-బిలో మహిళల సింగిల్స్‌లో.. ప్రపంచ నంబర్‌వన్...

Published : 27 Jan 2021 17:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ను విజయంతో ఆరంభించాలనుకున్న భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. గ్రూప్‌-బిలో మహిళల సింగిల్స్‌లో.. ప్రపంచ నంబర్‌వన్ షట్లర్‌‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో తలపడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. 21-19, 12-21, 17-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

తొలి గేమ్‌లో తెలుగు తేజం పైచేయి సాధించగా, రెండో గేమ్‌లో ప్రత్యర్థి విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మక గేమ్‌ ఉత్కంఠగా సాగింది. ఆదిలో తైజు 6-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా సింధు గొప్పగా పోరాడి 6-6తో స్కోరు సమం చేసింది. కానీ కొన్ని పొరపాట్లతో సింధు మరోసారి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. దీంతో 17-21తో మ్యాచ్‌ను కోల్పోయింది. 59 నిమిషాల పాటు ఈ మ్యాచ్‌ సాగింది.

ఇప్పటివరకు తై జు యింగ్‌తో సింధు 21 మ్యాచ్‌ల్లో తలపడగా 16 సార్లు ఓటమిపాలైంది. కాగా, సింధు తన తర్వాతి మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతానన్‌ రచనోక్‌తో తలపడనుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో సాగే ఈ టోర్నీలో.. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు సెమీస్‌కు అర్హత సాధిస్తారు.

దీ చదవండి

గంగూలీకి మరోసారి అస్వస్థత?

ఐపీఎల్‌ వేలం తేదీ ఖరారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని