Asia Cup: ఐపీఎల్ ఫైనల్‌ తర్వాత ఆసియా కప్‌ వేదికపై తుది నిర్ణయం: జై షా

ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సి ఉన్న ఆసియా కప్‌ (Asia Cup 2023)ను ఏ దేశంలో నిర్వహించాలనే దానిపై ఐపీఎల్ ఫైనల్‌ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు.

Published : 25 May 2023 15:52 IST

దిల్లీ: ఐపీఎల్-16 సీజన్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత  ఆసియా కప్‌ 2023ను ఏ దేశంలో నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా (Jay Shah) పేర్కొన్నారు.  మే 28న అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఐపీఎల్ ఫైనల్‌ను వీక్షించడానికి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డుల పెద్దలు వస్తారని ఆయన వెల్లడించారు. 

‘‘ఆసియా కప్‌ (Asia Cup 2023)ని ఏ దేశంలో నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం మేం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాం. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌  క్రికెట్ బోర్డుల ప్రముఖులు ఐపీఎల్ ఫైనల్‌ను చూడటానికి వస్తున్నారు.  అప్పుడు మేం చర్చించుకుని తగిన సమయంలో తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని జై షా పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్‌ పాకిస్థాన్‌లో జరగాలి. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌లో ఆడటానికి భారత్‌ సిద్ధంగా లేదు. టోర్నీని పాకిస్థాన్ నిర్వహిస్తే తాము ఆడబోమని భారత్ తేల్చిచెప్పింది. అనంతరం పాక్‌ ప్రతిపాదించిన ‘హైబ్రీడ్‌ మోడల్‌’ను మిగిలిన సభ్య దేశాలు తిరస్కరించాయి. సెప్టెంబర్‌ 2-17 మధ్య జరగనున్న ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని