IND vs WI : విండీస్‌తో ఐదో టీ20.. నామమాత్రమే కానీ.. అందుకు ఇదే చివరి సన్నాహకం!

విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో ఇప్పటికే కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ఆఖరి మ్యాచ్‌లోనూ...

Published : 07 Aug 2022 19:50 IST

ఇప్పటికే సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌ 

ఇంటర్నెట్ డెస్క్‌: విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో ఇప్పటికే కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ఆఖరి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. సిరీస్‌ ఫలితం తేలడంతో ఐదో టీ20 నామమాత్రమే కానీ.. ఆసియా కప్‌నకు ముందు సన్నాహకంగా ఇదే చివరి మ్యాచ్‌ అవుతుంది. విండీస్‌ పర్యటన ముగిసిన తర్వాత భారత్‌ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. కాబట్టి రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించేందుకు భారత్‌కు మరొక అవకాశం. ఈ మ్యాచ్‌కు హార్దిక్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. టాస్‌ నెగ్గిన హార్దిక్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో తొలుత వెస్టిండీస్ బౌలింగ్‌ చేయనుంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన విండీస్ చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది. 

జట్ల వివరాలు: 

భారత్‌: ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్య  (కెప్టెన్‌), దీపక్‌ హుడా, దినేశ్‌ కార్తిక్, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్ యాదవ్, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్

విండీస్‌: షమ్రా బ్రూక్స్, షిమ్రోన్ హెట్మయేర్, నికోలస్‌ పూరన్ (కెప్టెన్), డేవన్ థామస్, జాసన్ హోల్డర్‌, ఓడియన్‌ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, మెకాయ్‌, హేడెన్ వాల్ష్‌, రోవ్‌మన్ పావెల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని