Sanju Samson: ‘జట్టులో చోటు దక్కాలంటే..’ సంజూ శాంసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి ప్రకటించిన టీమిండియా జట్టులో యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై

Published : 22 Sep 2022 12:33 IST

చెన్నై: ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి ప్రకటించిన టీమిండియా జట్టులో యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై సంజూ తొలిసారిగా స్పందించాడు. జాతీయ జట్టులో చోటు దక్కడం చాలా సవాళ్లతో కూడుకున్నదన్నాడు.

‘‘టీమిండియాలో చోటు దక్కించుకోవడం నిజంగా చాలా సవాళ్లతో కూడుకున్నది. ఆ విషయంలో తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడున్న జట్టులోని ఆటగాళ్లకు కూడా తుది జట్టులో స్థానం కోసం పోటీ తప్పదు. ఇలాంటివి జరిగినప్పుడు, నా ఆట మీద దృష్టిపెట్టడం చాలా ముఖ్యం. అయితే, సవాళ్లను ఎదుర్కొంటూనే ఉండాలి. ప్రతిసారీ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మనకూ అవకాశాలు వస్తాయి’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజూ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం తన ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నానని చెప్పాడు.

ఇక ఆటగాళ్ల బ్యాటింగ్‌ స్థానాలపై మాట్లాడుతూ.. ‘‘ఒక స్థానానికే పరిమితం కావొద్దు. నేను ఓపెనర్‌ని.. నేను ఫినిషర్‌ని అని ఎప్పుడూ చెప్పుకోవద్దు. గత మూడు, నాలుగేళ్ల నుంచి నేను వేర్వేరు స్థానాల్లో ఆడుతున్నా. అది నా ఆటలో కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఏ ఆర్డర్‌లోనైనా ఆడగలనని విశ్వాసంతో ఉన్నా’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సంజూ భారత్‌ ‘ఏ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టు గురువారం నుంచి చెన్నై వేదికగా న్యూజిలాండ్‌ ‘ఏ’ జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని