Lakshya Sen: స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌పై చీటింగ్ కేసు..
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్‌పై బెంగళూరులో మోసం కేసు నమోదైంది. అతడు తన వయసును తక్కువగా చూపించి టోర్నీల్లో పాల్గొంటున్నాడని ఆరోపణలు వచ్చాయి.
దిల్లీ: భారత నంబర్ వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్‌పై బెంగళూరులో చీటింగ్ కేసు నమోదైంది. లక్ష్య సేన్, అతడి సోదరుడు చిరాగ్ సేన్ తమ వయసును తప్పుగా చూపించి 2010 నుంచి పలు టోర్నమెంట్లలో ఆడుతున్నారని గోవియప్ప నాగరాజా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేన్ సోదరులతో పాటు వారి తండ్రి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ ధీరేంద్ర, తల్లి నిర్మల, కోచ్ విమల్ కుమార్లపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఉత్తరాఖండ్‌కు చెందిన సేన్ సోదరులు బెంగళూరులోని ప్రకాశ్ పదుకొణె బ్యాడ్మింటన్ అకాడమీలో విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. ఫిర్యాదు దారు గోవియప్ప కూడా ఇదే నగరంలో మరో అకాడమీని నిర్వహిస్తున్నారు. విమల్ కుమార్, లక్ష్య సేన్ తల్లిదండ్రులు కలిసి 2010లో సేన్ సోదరులకు తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించారని గోవియప్ప ఆరోపించారు. వయసు తక్కువగా చూపించి పలు టోర్నమెంట్లలో వీరు పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం లక్ష్య సేన్ వయసు 24 ఏళ్లని.. కానీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన బర్త్ సర్టిఫికేట్లో 21 ఏళ్లుగా ఉందని ఆరోపించారు. ఇక లక్ష్య సోదరుడు చిరాగ్ వయసు 26 ఏళ్లయితే.. 24 ఏళ్లని జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను విమల్ కుమార్ ఖండించారు. ‘‘అవన్నీ అవాస్తవాలే. ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఆరోపణలే. బ్యాడ్మింటన్‌లో వయసు వెరిఫికేషన్, ధ్రువీకరణ అనేది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. నాపై వస్తోన్న నిరాధార ఆరోపణలు నేను ఖండిస్తున్నా’’ అని విమల్ స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై లక్ష్య సేన్, అతడి కుటుంబం ఇంతవరకూ స్పందించలేదు.
కాగా.. బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబరు 6 ఆటగాడైన లక్ష్య.. బుధవారమే రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నాడు. 2021లో ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన ఈ స్టార్ షట్లర్.. ఈ ఏడాది ఆరంభంలో భారత్ సాధించిన చారిత్రక థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్