Yoga: తొలి యోగాసన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. ఎక్కడ? ఎప్పుడంటే?

యోగాని ప్రపంచానికి పరిచయం చేసిన భారత్‌.. తొలిసారిగా యోగాసన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జూన్‌లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు ది నేషనల్‌ యోగాసన స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌(ఎన్‌వైఎస్‌ఎఫ్‌) వెల్లడించింది ఈ యోగా పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు

Published : 12 Nov 2021 01:56 IST

దిల్లీ: యోగాని ప్రపంచానికి పరిచయం చేసిన భారత్‌.. తొలిసారిగా యోగాసన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జూన్‌లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు ది నేషనల్‌ యోగాసన స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌(ఎన్‌వైఎస్‌ఎఫ్‌) వెల్లడించింది ఈ యోగా పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ‘‘భారత్‌.. తొలిసారిగా ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించనుంది. జూన్‌ 2022లో జరగబోయే ఈ టోర్నీ భారతదేశ ప్రాచీన క్రీడను ప్రపంచానికి చూపించబోతుంది’’అని ఎన్‌వైఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు ఉదిత్‌ సేథ్‌ అన్నారు. యోగాసన పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఏడాది జరిగిన ఖేల్‌ ఇండియా యూత్‌ గేమ్స్‌లో యోగాను కూడా చేర్చిన విషయం తెలిసిందే. మహిళలు, పురుషులు రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఆ పోటీలు విజయవంతం కావడంతో ప్రత్యేకంగా యోగాసన పోటీల్ని అంతర్జాతీయంగా.. అన్ని కేటగిరిల్లో నిర్వహించేందుకు, ఈ క్రీడోత్సవానికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం సమ్మతించింది. ప్రపంచమంతా ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో జూన్‌లో యోగాసన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. పోటీల్లో విజేతలను యోగా దినోత్సవం నాడు ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని