IND vs AUS: ఆసీస్‌ను బెంబేలెత్తించిన బౌలర్లు.. భారత్ లక్ష్యం 189

తొలి వన్డే మ్యాచ్‌లో (IND vs AUS) భారత బౌలర్లు అదరగొట్టేశారు. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. షమీ, సిరాజ్‌ కీలక వికెట్లను తీసి ఆసీస్‌ను దెబ్బ కొట్టారు.

Updated : 17 Mar 2023 17:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సుదీర్ఘ టెస్టు సిరీస్‌ అనంతరం జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ భారత బౌలర్లు అదరగొట్టారు. ముంబయి వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఆసీస్‌ను 188 పరుగులకే ఆలౌట్‌ చేశారు. మహమ్మద్ షమీ (3/17), సిరాజ్ (3/29) చెలరేగగా..  జడేజా 2, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్ చెరో వికెట్‌ తీశారు. టాస్‌ నెగ్గి భారత కెప్టెన్ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు సహకరించినట్లు అనిపించిన పిచ్‌.. మ్యాచ్‌ జరిగే కొద్దీ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. 

మిచెల్‌ ఒక్కడే..

బౌలింగ్‌ ప్రారంభించిన భారత్‌కు రెండో ఓవర్‌లోనే వికెట్‌ దక్కింది. అయితే ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ (22)తో కలిసి మిచెల్‌ మార్ష్ (81) దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. స్మిత్‌ ఔటైనప్పటికీ.. లబుషేన్ (15), జోష్ ఇంగ్లిస్‌ (26)తో కలిసి మార్ష్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
 అయితే 128/2 స్కోరుతో ఉన్న ఆసీస్‌.. భారత బౌలర్ల దెబ్బకు 60 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లను కోల్పోవడం విశేషం. సిరాజ్‌, షమీ తమ రెండో స్పెల్‌లో నిలకడగా వికెట్లు తీసి ఆసీస్‌పై ఒత్తిడి పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని