
Published : 19 Jan 2022 18:02 IST
IND vs SA : బవుమా, డస్సెన్ అద్భుత శతకాలు.. భారత్‌కు భారీ లక్ష్యం
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలోని పార్ల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌కు దక్షిణాఫ్రికా 297 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. కెప్టెన్ బవుమా (110: 8 ఫోర్లు), మిడిలార్డర్ బ్యాటర్ డస్సెన్ (129*: 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు డికాక్ (27) ఫర్వాలేదనిపించగా.. మలన్ (6), మార్‌క్రమ్ (4) విఫలమయ్యారు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడినా.. బవుమా, డస్సెన్ మాత్రం స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు చేసేశారు. నాలుగో వికెట్‌కు 204 పరుగులను జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా.. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. టీమ్‌ఇండియా బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
ఇవీ చదవండి
Tags :