IPL 2021: గర్జించిన గబ్బర్‌.. దుమ్మురేపిన డుప్లెసిస్‌..

క్రికెట్‌ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ పండగ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆదివారం ఐపీఎల్‌-14 సీజన్‌ రెండో దశ ప్రారంభంకానుంది.తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడబోతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌ మొదటి

Updated : 19 Sep 2021 10:20 IST

 తొలి దశలో పరుగుల వరద పారించిన ఆటగాళ్లు వీరే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ పండగ మళ్లీ వచ్చేసింది. యూఏఈ వేదికగా ఆదివారం ఐపీఎల్‌-14 సీజన్‌ రెండో దశ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్‌ మొదటి దశలో చాలా మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. కొంతమంది ఆటగాళ్లు ఫోర్లు, సిక్స్‌లు అలవోకగా బాదుతూ పరుగుల వరద పారించారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.

గర్జించిన గబ్బర్‌సింగ్‌: భారత క్రికెటర్లలో ‘గబ్బర్‌ సింగ్‌’ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు శిఖర్‌ ధావన్. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్‌.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 54.28 సగటుతో 380 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు అత్యధిక ఫోర్లు (43) బాదిన ఆటగాడిగానూ నిలిచాడు. అత్యధికంగా 92 పరుగులు వ్యక్తిగత స్కోరు సాధించాడు. మరి మొదటి దశలో గర్జించిన గబ్బర్‌.. రెండో దశలో ఎలా ఆడతాడోనని అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కేఎల్‌ కమాల్‌: ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పంజాబ్‌ కింగ్స్ జట్టు అంతగా రాణించలేదు. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి మూడింటిలో మాత్రమే నెగ్గింది. ఈ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కేఎల్‌.. 66.20 సగటుతో 331 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక సిక్సర్లు (16) బాదిన ఆటగాడు కూడా కేఎల్‌ రాహులే. నాలుగు అర్ధ శతకాలు కూడా బాదాడు. రెండో దశలోనూ రాహుల్ ఇదే జోరు కొనసాగించి జట్టును విజయాల బాట పట్టించాలని పంజాబ్‌ కింగ్స్‌ అభిమానులు కోరుకుంటున్నారు.


దుమ్మురేపిన డుప్లెసిస్‌: చెన్నై సూపర్‌ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్‌ ఈ సీజన్‌లో దుమ్మురేపాడు. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా పరుగులు చేస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన డుప్లెసిస్‌..64.00 సగటుతో 320 పరుగులు చేశాడు. అత్యధికంగా 95 పరుగుల వ్యక్తిగత స్కోరును సాధించాడు. సీఎస్కేకు కీలకమైన ఈ ఆటగాడు రెండో దశలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే  అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన కరేబియన్ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్)లో ఓ జట్టుతో మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు డుప్లెసిస్‌కు గాయమైంది. ఇతడు గాయం నుంచి త్వరగా కోలుకుని మ్యాచ్‌లు ఆడాలని సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు.


పృథ్వీ ‘షో’: టీమ్‌ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా.. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ.. 38.50 సగటుతో 308 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగే ఈ యువ బ్యాట్స్‌మన్.. జట్టు మంచి ఆరంభాలు అందించాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరి రెండో దశలోనూ పృథ్వీ.. ఇదే జోరును కొనసాగిస్తాడో లేదో చూడాలి.


శాంసన్‌ మెరుపులు: రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఏడు మ్యాచ్‌లు ఆడిన సంజూ.. 46.16 సగటు, 145.78 స్ట్రైక్ రేట్‌తో 277 పరుగులు సాధించాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో  63 బంతులను ఎదుర్కొని 119 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు