IND vs NZ:తొలి టెస్టు డ్రా.. విజయానికి వికెట్‌ దూరంలో నిలిచిపోయిన భారత్‌!

కాన్పూర్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆఖరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో

Updated : 29 Nov 2021 18:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాన్పూర్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆఖరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసి ఉంటే భారత్‌ ఘన విజయం సాధించేదే! అయితే, కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (2: 23 బంతుల్లో) రచిన్‌ రవీంద్ర (18: 91 బంతుల్లో 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ టీమ్‌ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు. దీంతో భారత్‌ తొలి టెస్టుని డ్రాగా ముగించాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఓపెనర్ టామ్‌ లేథమ్‌ (52: 146 బంతుల్లో 3 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. సోమర్‌ విల్లే (36: 110 బంతుల్లో 5 ఫోర్లు), కేన్‌ విలియమ్సన్‌ (24: 112 బంతుల్లో 3 ఫోర్లు) ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్లారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు, రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు, అక్షర్‌ పటేల్‌, ఉమేశ్ యాదవ్‌ తలో ఒక వికెట్‌ చొప్పున పడగొట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని