IND vs NZ: భారత్‌ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్‌.. కివీస్‌ లక్ష్యం ఎంతంటే?

కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌కు భారత్‌ 284 పరుగులను

Published : 28 Nov 2021 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌కు భారత్‌ 284 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టీమ్‌ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్‌ 283 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇవాళ మరో ఐదు నుంచి పది ఓవర్ల ఆట జరిగే అవకాశం ఉంది. టీమ్ఇండియా బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్ (65), వృద్ధిమాన్‌ సాహా (61*) అర్ధశతకాలు సాధించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (32), అక్షర్‌ పటేల్ (28*), పుజారా (22) ఫర్వాలేదనిపించారు. జడేజా డకౌట్‌ కాగా.. మయాంక్‌ అగర్వాల్ 17, గిల్ 1, రహానె 4 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో టిమ్‌ సౌథీ 3, జేమీసన్ 3, అజాజ్‌ పటేల్ ఒక వికెట్‌ తీశారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్ స్కోరు 345/10. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ 296/10.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని