Womens IPL: మహిళల ఐపీఎల్.. 25న ఐదు ఫ్రాంచైజీల పేర్లు వెల్లడి!

మహిళల ఐపీఎల్ (ipl 2023) కోసం బీసీసీఐ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫ్రాంచైజీల కోసం బిడ్డింగ్‌లను ఆహ్వానించిన బీసీసీఐ (bcci) మరో ముందుడగు వేసింది. ఫ్రాంచైజీల పేర్లను వెల్లడించేందుకు సిద్ధమవుతోంది.

Published : 13 Jan 2023 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల ఐపీఎల్‌ (womens ipl 2023) కోసం బీసీసీఐ (bcci) ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఐపీఎల్‌లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను జనవరి 25న బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆర్థిక బిడ్లను ఇప్పటికే బీసీసీఐ సీల్‌ చేసింది. అదే రోజు వీటిని తెరవనుంది. అయితే బీసీసీఐ ‘‘అత్యున్నత ద్రవ్య ప్రతిపాదనను అంగీకరించాల్సిన అవసరం లేదు’’ అని టెండర్‌ పత్రంలో తెలిపింది.  డబ్ల్యూఐపీఎల్‌(WIPL) ఐదు ఫ్రాంచైజీలను, వేదికలను సొంతం చేసుకోవడానికి బీసీసీఐ గతవారం బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్‌ విడుదల చేసింది. బిడ్డర్లు ఒకటి కంటే ఎక్కువ ఫ్రాంచైజీలకు, నగరాలకు పోటీ పడవచ్చు. కానీ అంతిమంగా విజయవంతమైన బిడ్డర్‌కు ఒక ఫ్రాంచైజీ మాత్రమే దక్కుతుంది.

ఒకే వేదిక కోసం రెండు అత్యధిక బిడ్లు ఒకే ధర నిర్ణయిస్తే బీసీసీఐ మళ్లీ బిడ్‌ నిర్వహిస్తుంది. రెండు వేదికలకు ఇద్దరు బిడ్డర్లు అత్యధిక ధరతో బిడ్‌ వేస్తే ఆ ఉత్తర్వులను నిర్ణయించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉంటుంది. ఒక బిడ్డర్‌ ఒకటి కంటే ఎక్కువ వేదికలకు ఎక్కువ మొత్తంతో బిడ్‌ వేస్తే వేదికను నిర్ణయించే స్వేచ్ఛ బీసీసీఐకి ఉంటుంది. 

2023 నుంచి 2025 వరకు మూడు సీజన్లలో ఒక్కో జట్టుకు 22 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. లీగ్‌ దశలో ఒక్కో టీమ్‌ 20 మ్యాచులు ఆడనుంది. అగ్రస్థానంలో ఉండే జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడతాయి. అందులో విజయం సాధించిన జట్టు తుది పోరుకు అర్హత సాధిస్తుంది. మహిళల ఐపీఎల్‌ నిర్వహణకు మార్చి నెల అనువుగా ఉంటుందని బీసీసీఐ తెలిపింది. 2026 సీజన్‌ నుంచి టోర్నమెంట్లో 33 నుంచి 34 మ్యాచులు నిర్వహిస్తారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని