ICC U19 World Cup 2024: అండర్ -19 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

యువ క్రికెటర్ల కోసం మరో మెగా టోర్నీ సిద్ధమవుతోంది. అయితే ఇది 2024 ఆరంభంలో ప్రారంభం కానుంది. అండర్ -19 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ను తాజాగా ఐసీసీ ప్రకటించింది.

Published : 22 Sep 2023 17:29 IST

ఇంటర్నెట్ డెస్క్: సీనియర్ల వన్డే ప్రపంచకప్‌ ముగిసిన రెండు నెలల్లోనే మరో టోర్నీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాదిలో (2024) జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు అండర్ -19 వరల్డ్ కప్‌ జరగనుంది. తాజాగా ఐసీసీ ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పదిహేనో ఎడిషన్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంక - జింబాబ్వే జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన భారత్‌ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జనవరి 14న తలపడనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్‌ కోసం పోరాడనున్నాయి. గ్రూప్‌ Aలో యువ భారత్‌ ఆడనుంది. లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌ (జనవరి 14న), యూఎస్‌ఏ (18న), ఐర్లాండ్‌ (20న)తో టీమ్‌ ఇండియా మ్యాచ్‌లు ఆడుతుంది. నాలుగు గ్రూప్‌ల నుంచి టాప్‌ -3 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. మళ్లీ రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్‌కు చేరే జట్లేవో ఈ నాలుగింటిలోనే తేలుతాయి. జనవరి 6 నుంచి 12 వరకు వార్మప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని