Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్‌తో మ్యాచ్‌పైనే ఉంది: హర్మన్‌ ప్రీత్‌ కౌర్

మహిళల టీ20 ప్రపంచకప్‌  (Womens t20 world cup) ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభంకానుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ని ఢీకొనబోతోంది. 

Published : 06 Feb 2023 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  మహిళల ప్రీమియర్ లీగ్ వేలంను ఫిబ్రవరి 13న ముంబయిలోని నిర్వహించనున్నారు. అదేరోజు మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. అయితే, తమ దృష్టి అంతా వేలంపై కాకుండా పాక్‌తో ఆరంభ మ్యాచ్‌పైనే ఉందని భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur) పేర్కొంది.

‘మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలం కంటే ఇది మాకు చాలా కీలకమైన మ్యాచ్‌. మా దృష్టంతా ఇప్పుడు దానిపైనే ఉంది. అన్నింటి కంటే ప్రపంచ కప్‌ ముఖ్యమైనది. మా ఫోకస్‌ ఐసీసీ ట్రోఫీపై ఉంది. ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటాయి. ఆటగాడిగా మనకు ఏది ముఖ్యమో దానిపైనే దృష్టి కేంద్రీకరించాలి.  మేమందరం తగినంత పరిణతి చెందాం. ఏది ముఖ్యమైనదో మాకు తెలుసు’ అని హర్మన్‌ ప్రీత్ కౌర్‌ వివరించింది. వేలం గురించి మాట్లాడుతూ.. ‘మనందరికీ ఇది నిజంగా గొప్ప రోజు. ఈ రోజు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. రాబోయే రెండు లేదా మూడు నెలలు మహిళల క్రికెట్‌కు చాలా ముఖ్యం. మహిళల బిగ్‌ బాష్‌ లీగ్ (ఆస్ట్రేలియా), ది హండ్రెడ్ (ఇంగ్లాండ్) లీగ్‌లు ఆయా దేశాల్లో క్రికెట్‌ను మెరుగుపరచడంలో ఎలా ఉపయోగపడుతున్నాయో చూస్తున్నాం. మన దేశంలో కూడా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా అదే జరుగుతుందని ఆశిస్తున్నా’ అని భారత కెప్టెన్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని