Siraj: ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను : సిరాజ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలంలో తొలిసారి దక్కిన డబ్బుతో.. ఓ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొన్నానని హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం సిరాజ్‌ రాయల్...

Updated : 02 Feb 2022 10:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలంలో తొలిసారి దక్కిన డబ్బుతో.. ఓ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొన్నానని హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం సిరాజ్‌ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పలువురు బెంగళూరు జట్టు ఆటగాళ్లు తమ అనుభవాలను పంచుకున్నారు. విరాట్ కోహ్లీ, ఏబీ డి విలియర్స్‌, గ్లెన్ మాక్స్‌వెల్, సిరాజ్‌ తదితరులు ఈ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.

‘ఐపీఎల్ ద్వారా తొలిసారి అందుకున్న డబ్బుతో ఐఫోన్‌ 7ప్లస్‌, ఓ సెకండ్ హ్యాండ్ కారు (టయోటా కంపెనీకి చెందిన కరోలా) కొన్నాను. ఐపీఎల్‌లో ఆడుతున్నామంటే ఆ మాత్రం ఉండాలి కదా! ఎంత కాలమని పాత బైక్‌పై తిరుగుతాం? అందుకే కారు కొన్నా. అప్పటికీ నాకు డ్రైవింగ్ కూడా రాదు. దీంతో మా కజిన్‌ని డ్రైవింగ్‌కి తీసుకెళ్లేవాడిని’ అని సిరాజ్‌ వెల్లడించాడు. తొలుత సిరాజ్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) తరఫున ఆడాడు. అరంగేట్ర సీజన్‌లో ఆడిన 6 మ్యాచుల్లోనే 10 వికెట్లు పడగొట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2017 ఐపీఎల్‌ వేలంలో 2.6 కోట్లు వెచ్చించి బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. తాజాగా, బెంగళూరు యాజమాన్యం విరాట్‌ కోహ్లీ (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు), మహమ్మద్‌ సిరాజ్‌ (రూ. 7 కోట్లు)లను రిటెయిన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని