WPL: బీసీసీఐకి కాసుల వర్షం.. మహిళా ప్రీమియర్‌ లీగ్‌ జట్లు ఇవే

‘మహిళల ప్రీమియర్‌ లీగ్’ (WPL) జట్ల వేలం వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఈ వేలం ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది.  

Published : 25 Jan 2023 16:43 IST

ముంబయి: మహిళల ఐపీఎల్‌ పేరుని ‘మహిళల ప్రీమియర్‌ లీగ్’(WPL)గా ఖరారు చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ లీగ్‌లో ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలం వివరాలను ఆయన  వెల్లడించారు. ఈ వేలం ద్వారా బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. ఐదు జట్ల ద్వారా బీసీసీఐకి రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరింది. 2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే ఈ మొత్తం ఎక్కువ అని జై షా పేర్కొన్నారు. ఇది మహిళల క్రికెట్‌లో విప్లవానికి నాంది పలుకుతుందని, మహిళల క్రికెట్‌లో అవసరమైన సంస్కరణలను తీసుకువస్తుందన్నారు.

ఐదు జట్లు ఇవే.. 

ఐదు ప్రాంఛైజీలు ఈ వేలంలో పాల్గొని జట్లను సొంతం చేసుకున్నాయి. అహ్మదాబాద్‌ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ.1,289 కోట్లకు, ముంబయి జట్టును ఇండియావిన్‌ స్పోర్ట్స్‌ రూ.913 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ రూ.901 కోట్లకు, దిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్  రూ.810 కోట్లకు‌,  లఖ్‌నవూ జట్టును కాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ రూ.757 కోట్లకు దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని