T20 World cup: బుమ్రా కాదు.. రవిశాస్త్రి మాట్లాడాల్సింది: అజహరుద్దీన్‌

పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ఎదురైన రెండు వరస పరాభావాలను భారతీయ క్రీడాభిమానులకు మింగుడుపడట్లేదు. దాయాది దేశం పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడటంతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. భారత్‌ ఓటమికి అనేక కారణాలను ప్రస్తావిస్తూ విమర్శలు

Updated : 02 Nov 2021 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ఎదురైన రెండు వరస పరాజయాలు భారత క్రీడాభిమానులకు మింగుడుపడట్లేదు. దాయాది దేశం పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడటంతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. భారత్‌ ఓటమికి అనేక కారణాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కాకుండా.. బుమ్రా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రెస్‌మీట్‌పై మాజీ భారత క్రికెటర్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ స్పందిస్తూ.. బుమ్రా బదులు కోచ్‌ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

‘‘కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ప్రెస్‌మీట్‌లో పాల్గొనడం ఇష్టంలేకపోతే ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పాల్గొనాల్సింది. కేవలం మ్యాచ్‌లో గెలుపొందినప్పుడే మీడియాతో మాట్లాడుతామంటే తగదు. మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన అవమానంగా భావించాల్సిన అవసరమూ లేదు. కెప్టెన్‌ లేదా కోచ్‌ మీడియా ముందుకొచ్చి మ్యాచ్‌ ఓటమిపై వివరణ ఇవ్వాల్సింది. ఓటమికి సంబంధించి మీడియా అడిగే ప్రశ్నలకు బుమ్రా ఎలా సమాధానం చెప్తారనుకుంటారు? మ్యాచ్‌ గెలిచినప్పుడు ఎలా మీడియా ముందుకొస్తారో.. ఓడినా అలాగే రావాలి. బుమ్రాను మీడియా ముందు మాట్లాడించడం సరైన పద్ధతి కాదు. కెప్టెన్‌ లేదా కోచ్‌ ప్రెస్‌మీట్‌కు వెళ్లాలి.. వారిద్దరూ వెళ్లలేకపోతే కోచింగ్‌ సిబ్బందినైనా పంపించాల్సింది’’అని అజహరుద్దీన్‌ తన అభిప్రాయాన్ని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని